బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్


బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్


రాష్ట్ర మంత్రి   శ్రీనివాస్ గౌడ్ బిజెపి ఆన్లైన్, మొబైల్ నెంబర్ ఆధారిత సభ్యత్వ నమోదుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఎం ధర్మారావు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,రాష్ట్ర బిజెపి సభ్యత్వ ప్రముఖ్ తెలిపారు.


దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా మొబైల్ ద్వారా బిజెపి సభ్యత్వం తీసుకోవడం పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ  హర్షం వ్యక్తం చేస్తుండగా విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు


 *టిఆర్ఎస్* *పార్టీ చేస్తున్నట్లు ఓటర్* *లిస్టు ముందు పెట్టుకుని ఇంట్లో* *కూర్చొని బిజెపి సభ్యత్వాన్ని* *నమోదు చేయడం* *లేదు* . *టిఆర్ఎస్ పార్టీ లాగా ఆశలు* *చూపడం లేదు. బలవంతం* *పెట్టడం లేదు. భయ* *పెట్టడం లేదు. టీఆర్ఎస్ సభ్యత్వం* *తీసుకోకపోతే పెన్షన్లు,* *రైతుబంధు ఆగిపోతాయని ప్రజలను* *భయ పెట్టడం లేదు.* *సభ్యత్వం చేసుకుంటే ఇన్సూరెన్స్* *వస్తుందని టిఆర్ఎస్ లాగా బిజెపి* *తాయిలాలు ప్రకటించలేదని విమర్శించారు.


జాతీయవాదాన్ని బలపరచాలని, దేశం అభివృద్ధి చెందాలని,  ప్రధాని నరేంద్ర మోదీ గారిని బలోపేతం చేయాలని,  బిజెపి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, స్వచ్ఛందంగా వారికి వారే మొబైల్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారని తెలిపారు.


కుటుంబ పార్టీలను తెలంగాణ ప్రజలు  వివిధ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ వాదులు తిరస్కరిస్తున్నారని,  రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుండడం, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణ ప్రజలు తిరగబడుతుండడంతో ఆ పార్టీ  నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నరు.


మంత్రి   శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నట్లుగా ఒక గంటలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం  మూడు కోట్లు నమోదు చేసి మొబైల్ ద్వారా చూపించాలని టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ  సవాల్ చేస్తున్నదని .  టీఆర్ఎస్ పార్టీకి ఒక్క గంట కాదు పది రోజుల సమయం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని  చేయాలని సవాల్ చేశారు.


 మంత్రి  శ్రీనివాస్ గౌడ్  ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ చేసిన సభ్యత్వ నమోదుకు అనుగుణంగా మొబైల్ ద్వారా  అంతే సభ్యత్వ నమోదును చేసి  చూపించాలని, ఆ విధంగా నమోదు చేసి వివరాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.


టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు  కల్వకుంట్ల తారక రామారావుతో పాటు , టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, మొబైల్ సభ్యత్వ నమోదుపై అవగాహన రహితంగా మాట్లాడడం మానుకోవాలని, *శాసనసభ,* *పార్లమెంటు ఎన్నికలలో* *ఇచ్చిన వాగ్దానాలను* *అమలు చేయలేక పోవడంతో ప్రజలు* *టిఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో* *ఉన్నారని, . *టిఆర్ఎస్* *పార్టీ కుటుంబ పాలనను* *ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.* *నియంతృత్వ,* *నిరంకుశ టిఆర్ఎస్* *ప్రభుత్వ పై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు.


రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో ఓటమి ఖాయమని, టిఆర్ఎస్ పార్టీ బలహీనపడి పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని. టిఆర్ఎస్ పార్టీ బలహీనపడడం భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం, ప్రత్యామ్నాయంగా  అత్యధికంగా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను బిజెపి గెలుచుకుంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీకి తిరోగమనం, పురోగమనంతో  బలమైన శక్తిగా బిజెపి రాష్ట్రంలో ఎదిగిందని అన్నారు.



2023లో కానీ,  ఒకవేళ అంతకుముందు కానీ శాసనసభ ఎన్నికలు జరిగితే బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్