ప్రింట్ మీడియాలో నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కు వ -- మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ
ప్రింట్ మీడియాలో నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కువ -- మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ
కోల్‌కతా: ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన మీడియా అవార్డుల కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. ప్రింట్ మీడియాలో సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే ముద్రిస్తారని కాబట్టి నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కువని అన్నారు.సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పంపే నకిలీ సమాచారం కారణంగా సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అమాయకులైన ప్రజలు వాటిని నమ్మి షేర్ చేస్తారు, కాబట్టి ఇలాంటి వార్తలను దృష్టికి వచ్చినపుడు జాగ్రత్త వహించాలని సూచించారు. తనకు ప్రింట్ మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని అన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా స్వేచ్ఛగా వార్తలు రాయాలని ప్రణబ్ వారికి సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న నాలుగో ఎస్టేట్ అయిన మీడియాను ఆయన ప్రశంసించారు

Comments
Post a Comment