అక్క మొగుడే కాలయముడు.
అక్క మొగుడే కాలయముడు.
ఒంగోలు: అక్క మొగుడే కాలయముడయ్యాడు. బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి.. చివరికి ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు అత్యచారం చేశాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే తల్లి తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు. బావ సుధాకర్ వేధింపులు భరించలేని యువతి చివరికి ప్రాణాలు తీసుకున్న ఘటన ఒంగోలులో కలకలం రేపుతోంది. ఢిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని గత కొంతకాలంగా ఆమె బావ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె అక్కను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లో ఇల్లరికం అల్లుడుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో మరదలిపై కన్నేశాడు. పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు.
ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. మరదలితో తాను కలిసిన వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సుధాకర్ అసలు స్వరూపం బయడపడంతో వారు రెండో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాము సుధాకర్‌ను పలుమార్లు మందలించామని, అయినా అతనిలో మార్పు రాలేదని యువతి బంధువులు తెలిపారు. సుధాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment