ముంబై లో భారీ అగ్నిప్రమాదం
ముంబై :
మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ముంబైలోని మజ్‌గాం ప్రాంతంలోని ముస్తఫా బజార్ టింబరు యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
శ్వేతామార్గ్ లో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు 8 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.

Comments
Post a Comment