ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంఎల్ సిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తాతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఎల్ఎ కోటా ఎంఎల్ సి ఎన్నికల్లో గుత్తా ఎంఎల్ సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎంఎల్ సిగా ఎన్నుకున్న ఎంఎల్ఎలకు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆశయ సాధనలో తాను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు పాల్గొన్నారు.
Comments
Post a Comment