ఇరాన్ అధ్యక్షుడి తో భేటీ అయిన ప్రధాన మంత్రి
ఇరాన్ అధ్యక్షుడి తో భేటీ అయిన ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74వ సమావేశం సందర్భం గా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రూహానీ తో ఈ రోజు న ప్రత్యేకం గా సమావేశమయ్యారు. నేతలు ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల ను గురించి చర్చించడంతో పాటు పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ పరిణామాలు మరియు ప్రపంచ పరిణామాల పై వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు.
ఇరాన్ కు, భారతదేశాని కి ప్రాచీన నాగరకతపరమైన బంధాలు ఉన్నాయని, 2015వ సంవత్సరం లో ఉఫా లో వారి తొలి సమావేశం నాటి నుండి ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్న పురోగతి ని ఉభయులూ సకారాత్మక రీతి న అవలోకించారు. ప్రత్యేకించి చాబహార్ నౌకాశ్రయం కార్యకలాపాలు ఆరంభం అయిన సంగతి ని వారు పరిగణన లోకి తీసుకొని, అది అఫ్గానిస్తాన్ మరియు మధ్య ఆసియా ప్రాంతం లో కు ఒక ముఖద్వారం వలె ఉందని పేర్కొన్నారు.
భారతదేశానికి గల్ఫ్ ప్రాంతం కీలక ప్రాముఖ్యం కలిగినటువంటిదని, ఆ ప్రాంతం యొక్క శాంతి, భద్రత మరియు స్థిరత్వం ల పరిరక్షణే ధ్యేయంగా దౌత్యం, సంభాషణలు మరియు విశ్వాస ప్రోత్సాహక చర్యల కు ప్రాధాన్యాన్ని కట్టబెట్టడాన్ని భారతదేశం సమర్ధిస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
దౌత్య సంబంధాలు ఏర్పడిన నేపథ్యానికి సూచకం గా 70వ వార్షికోత్సవాన్ని 2020వ సంవత్సరం లో జరపాలన్న విషయమై ఇరు పక్షాలు అంగీకరించాయి.
Comments
Post a Comment