క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణం

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని చిదిమేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా శంషాబాద్‌ వద్ద పక్కనే ఉన్న ద్విచక్రవాహనాన్ని క్యాబ్  ఢీకొట్టింది. దీంతో కారు డోర్‌లో బైక్‌పై ఉన్న వ్యక్తి చొక్కా చిక్కుకుంది. ఇది గమనించని క్యాబ్‌ డ్రైవర్‌ కారును వేగంగా తీసుకెళ్లాడు. ద్విచక్రవాహనదారుడిని కారు ఆరు కిలోమీటర్ల లాక్కెళ్లింది. సుమారు ఆరు కి. మీ తర్వాత గమనించి చూడగా వాహనదారుడు ప్రాణాలను విడిచాడు. మృతదేహాన్ని, కారును వదిలి క్యాబ్‌ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్