*పాత నేరస్తులపై పటిష్టమైన నిఘా : ఎస్పీ రంగనాధ్*

*పాత నేరస్తులపై పటిష్టమైన నిఘా : ఎస్పీ రంగనాధ్*



నల్గొండ : జిల్లాలో సమర్ధవంతంగా శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు.


గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పాత నేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు పట్టణ ప్రాంతాలలో దొంగతనాలను తగ్గించడం, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం కోసం పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు కాలనీలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాలలో కమ్యూనిటీ పోలీసింగ్ , నేను సైతం కింద కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎన్నో కేసులలో సిసి కెమెరాలు నేరస్థులను పట్టించిన విషయాన్ని ప్రజలలోకి మరింత బలంగా తీసుకెళ్లడం ద్వారా సిసి కెమెరాల ఏర్పాటు పెద్ద ఎత్తున జరిగే విధంగా చూడాలని అన్నారు. ప్రతి అంశంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ విధి నిర్వహణను నిబద్దతతో నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు.


సమావేశంలో నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిఎస్పీలు గంగారాం, శ్రీనివాస్, మహేశ్వర్, ఎస్.బి. డిఎస్పీలు గుజ్జ రమేష్, రమణారెడ్డి, సిఐలు సురేష్, బాషా,  రవి కుమార్, బాలస్వామి,  సిబ్బంది అర్జున్ రెడ్డి, శంకర్, తిరుపతి, హేము నాయక్, ఆఫ్రోజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్