హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు





హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి


ఈ.వి.యం.లు తరలింపు



ర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉపయోగించేందుకు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్,జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో ఈ.వి.యం.గోడౌన్ లు తెరచి సూర్యా పేట జిల్లా హుజుర్ నియోజక వర్గ ఉప ఎన్నిక లకు సూర్యా పేట జిల్లా నుండి వచ్చిన అధికారులకు అప్పగించి తరలించారు. బెల్ కంపెనీ తయారు చేసిన  530 బ్యాలెట్ యూనిట్ లు,408 కంట్రోల్ యూనిట్ లు,438 వి.వి. ప్యాట్ లు ఇటీవల నల్గొండ పార్లమెంట్ నియజకవర్గ ఎన్నికల్లో వినియోగించిన వాటిని హుజూర్ నగర్ కు పంపిస్తున్నారు. ఈ.వి యం గోడౌన్ తెరచి హుజూర్ నగర్ కు తరలించే కార్యక్రమంలో టి. డీ.పి.జిల్లా కార్యదర్శి ఎం. ఏ.రఫీ,పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ,


టి.అర్.ఎస్.యూత్ ఇంఛార్జి జమాల్ ఖాద్రి,సి.పి. ఐ.నుండి పల్లా దేవేందర్ రెడ్డి,సి.పి.యం.నుండి నర్సి రెడ్డి లు, పశు సంవర్థక శాఖ ఏ. డి. శ్రీనివాస్,కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు చందన వదన,పరిపాలన అధికారి మోతి లాల్,ఎన్నికల డి.టి.విజయ్ లు పాల్గొన్నారు






Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్