గిరిజన మహిళపై గ్యాంగ్‌ రేప్‌!

గిరిజన మహిళపై గ్యాంగ్‌ రేప్‌!


నలుగురితోపాటు
యజమాని అఘాయిత్యం
వెలుగులోకి ఘోరం, ఐదుగురిపై కేసు
ఉప్పునుంతల/నాగర్‌ కర్నూల్‌/చార్మినార్‌/హైదరాబాద్‌, బతుకుదెరువు కోసం వచ్చిన గిరిజన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చినట్లు నటించాడు అతను. ఆ గృహిణిపై కన్నేశాడు ఆ యజమాని. మభ్యపెట్టి ఆమెను ఓ గదిలో నిర్బంధించి మరో నలుగురితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెకు మత్తు ఇచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పహాడిషరీఫ్‌ పోలీసులను ఆశ్రయించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఓ తండాకు చెందిన కుటుంబం నగర శివారులో ఉంటోంది. ప్రతాప్   రెడ్డి అనే వ్యక్తి నడిపించే కోళ్ల ఫారంలో వాళ్లు పనికి కుదిరారు.
 
నెలకు 15 వేలు జీతమిచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈనెల 18న స్నేహితుడి కోళ్ల ఫారంలో పని ఉందని ప్రతా్‌పరెడ్డి గిరిజన కుటుంబాన్ని కారులో అక్కడికి తీసుకువెళ్లాడు. ఆమె భర్తను ఓ గదిలో ఉంచాడు. గృహిణిని మరో గదిలో నిర్బంధించి, లైంగిక దాడి చేశాడు. వెంటనే మరో నలుగురు వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి వారు చిత్రహింసలకు గురిచేశారు.
 
మూడు రోజులపాటు మూకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడిన తర్వాత వదిలేయడంతో గృహిణి తన భర్తకు ఈ విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ప్రతా్‌పరెడ్డి, అతని మనుషులు బెదిరించి, కులం పేరుతో దూషించారు. చికిత్స నిమిత్తం 20 వేలు ఇచ్చి పంపించారని బాధితురాలు తెలిపింది. చివరకు బాధితురాలు తమ గ్రామానికి చెందిన పెద్దల సాయంతో పహాడీషరీష్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లతోపాటు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్