సిట్టిగాడి వార్త...వాత...😊😊😊

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊


పాకిస్తాన్ లో ఇమ్రాన్ సారు, అమరావతిలో మా పెద్ద సారు ఒకే రీతిలో బాధ అనుభవిస్తున్నారని వారు పెడుతున్న పెడబొబ్బల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉందని పరిశీలకులు అంచనా వేశారని సిట్టికి సమాచారం అందగానే ఇమ్రాన్ సంగతి సెప్పలేను గాని సారు సెప్పినట్లు సిన్న సారు పాలన ఘోరంగా ఉంటే మళ్ళీ పదవి మనకే అని ఎగిరి గంతులు వెయ్యాలి కానీ ఈ పెడబొబ్బలు యేటి అని సిట్టి రుసరుస లాడుతూ ఎడవకు,ఎడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో అని పాట అందించాడు...ఏటి సెత్తమ్...


చిన్న సారు ప్రేమ స్వరూపులు అని సారు అభిమానుల గట్టి నమ్మకం...కొడాలి నాని సారు ఒక పక్క ఎన్టీఆర్ సారు బొమ్మ,మరో పక్క వైస్సార్ గారి బొమ్మ ఎత్తుకుని సేలాకిగా తిరుగుతుంటే కనపడటం లేదా...లక్ష్మీ పార్వతి గారికి మా పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించాం కదా...మముల్ని ఆడి పోసుకోవటం ఏమి బాగా లేదు అని వారి వాదన...


వీరి వాదన ఇలా ఉంటే పెద్ద సారు అభిమానుల వాదన మరోలా ఉంది..ఆరోపణలు చేసినంత ఈజి కాదు మా సారుని ఇరికించటం,ఇప్పటికి ఏమి నిరూపించలేక పోయారు అనే సమయానికి సారు ఎన్నిక సెల్లదు అని హైకోర్టు లో పిటిషన్ వేశారట...పెద్ద సారు  ఇలాటివి ఎన్ని సూడలేదు ఇదీ అంతే సారు అభిమానులు లైట్ తీసుకుంటే ఇదన్నా రుజువు అయ్యే ఛాన్స్ దొరికి పెద్ద సారు ఇరకాటంలో పడాలి అని సిన్న సారు అభిమానుల కోరిక...ఎవరిది పై చేయి అవుతుందో లేక ఇది కూడా మూల పడేస్తారో సూడాలి...


పండగ టైములో సమ్మె మజా అనుభవించితే తెలియనులే లక్కీ ఛాన్స్ లే అనే పేరడీ పాటతో తెలంగాణ rtc ఉద్యోగులు సమ్మె బాట పట్టబోతున్నారు అని సమాచారం...చిన్న సారు rtc ని అమరావతిలో గవర్నమెంట్లో విలీనం సేసిన దగ్గరనుండి ఈరు కూడా మాకు కూడా ఆ విధంగా సేయాలి అని సిన్న పిల్లల మాదిరి మారాం సేస్తున్నారు...ఒక పక్క ఉప ఎన్నిక,మరో పక్క పండగ...కేసీఆర్ సారు ఈ గండం నుండి ఎలా బయట పడతారో అని సిట్టి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు...


రాష్ట్రానికి జలకళ వచ్చింది కానీ ఆ ఆనందం తడిసి ముద్ద అవుతున్న చిన్న సారుకి,ఆయన అభిమానులకు బొగ్గు రూపంలో మరో కష్టం వచ్చి పడింది...భలి భలి దేవా బాగున్నదయా నీ మాయ నారదుడు పాడిన పాట సిన్న సారుకి వినపడ్డ ఎంటనే కేంద్ర మంత్రికి ఇదే నా మొదటి బొగ్గు లేక రాశాను నీకు సెప్ప లేక అని లేఖ రాసి తగిన విధంగా బొగ్గు సరఫరా సేయమని విన్నపాలు సేసినట్లు వార్త...ఇసుక కొరత కూడా తీరి రాళ్లలో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు అనే పాట పాడుకుంటూ తమ పేర్లు రాసుకునే శుభ సమయం కోసం కూడా పెజలు ఎదురు చూస్తున్నారు..


తన మాట సెల్లు బాటు కాక పోవటంతో ఏమనుకున్నావు,నన్నేమనుకున్నావు అనే పాట పాడుకుంటూ ఢిల్లీ వెళ్లారని టాక్... హుజూర్ నగర్ నెగ్గటం పక్కన పెడితే వీరి కీచు లాటలు..కాంగ్రెస్, బీజేపీ, తెలుగు దేశం ఎవరికి వారే యమునా తీరే అన్న పద్దతిలో కొట్టకుంటుంటే trs శ్రేణులు రొట్టె విరిగి నేతిలో పడ్డాక అనే పాట పాడుకుంటూ సంతోషంలో మునిగి పోయారట...


పెపంచ వ్యాప్తంగా సినిమాలు రిలీజ్ సేయటంలోను,పండుగలు జరుపుకోవడం లోను మన ముందు ఉంటాం అనే దానికి బతుకమ్మ పండుగ కూడా ఇదేశాలలో జరుపుకుంటూ అక్కడి బిడ్డలు సంతోషంతో పులకిస్తున్నట్లు సిట్టికి వచ్చిన వార్త...జీవితంలో సగ భాగం పండుగలు,సగ భాగం క్రికెటికి సగ భాగం సినిమాలకి సరిపోవటంతో జీవితమున సగ భాగం నిద్దరకే సరిపోవును అన్న సినీ కవి పాట ఈ రోజులలో ఇనిపించటం లేదు... మనం ఇలా బిజీ గా ఉంటే మన పాలకులు పూర్తి కాలం సంపాదన మార్గంలో ఉండి మనకి వివిధ పథకాల  పేరిట తాయిలాలు అందిస్తున్నారు...


అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాల్లో నిన్న పెజలు భక్తి శ్రద్దలతో పాల్గొని పులకించి పోయారు... అమ్మను మించి దైవమున్నదా సిట్టికి (ఆత్మ) మించి సత్య మున్నదా అనే పాటతో ఈ రోజు వార్తలకి ముగింపు..😊😊😊😊
😊😊😊😊😊😊 మీ సిట్టి...


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్