సిట్టిగాడి...వార్త...వాత....😊😊
సిట్టిగాడి...వార్త...వాత....😊😊
జననీ శివగామిని జయ శుభకారిణి, విజయ రూపిణి జననీ శివగామిని...నేడు దేవీ నవరాత్రులు ప్రారంభ శుభ సమయంలో మనకి మంచి జరగాలని అమ్మవారిని సిట్టి వేడుకుంటున్నాడు...
తిరుపతి లో బ్రహ్మోత్సవం ప్రారంభం కూడా నేడే అవటంతో వ్ స్వామిని కూడా సిట్టి వేడుకుంటున్నాడు...అందరినీ చల్లగా సూడమని....
గ్రామ వాలంటీర్ ఉద్యోగ ముచ్చట...ఈ ఉద్యోగం ఏ మూర్తనా ప్రాంభించారో కానీ విమర్శల సుడి గుండంలో ఇరుక్కుని ఉద్యోగం చేసే వారికి ఆవేదన కలిగించేటట్లుగా రభస కొనసాగుతోంది...చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం రాక వయసు పెరుగుతూ ఇంట్లో వారిని డబ్బు అడగలేక తమ చేతి ఖర్చులకు అయినా వస్తాయి అనే ఉద్దేశంతో అనేక మంది చేరి ఉద్యోగం చేసుకుంటున్నారు...వారికి లేని బాధ విమర్శలు చేస్తున్న వారికి ఎందుకో అర్థం కాదు... ఖాళీగా ఉంటే మీ అబ్బాయి ఇంకా ఉద్యోగం చేయటం లేదా అనే మాటలు పిల్లల తల్లి తండ్రులకి నిత్యం ఎదురు వచ్చే ప్రశ్నలే...అంతెందుకు ఒక సందర్భంలో సిన్న బాబు తమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనములో ఒక ప్రశ్నకి జవాబుగా గూగుల్ లో నాకే రాలేదు,నీకు ఎలా వస్తది జాబు అని చమత్కారం సేసినట్లు అప్పట్లో ఒక వార్త రౌండ్ వేసింది... మంచి ఉద్యోగం వచ్చే వరకు ఇంట్లో వారికి భారం కాకుండా వచ్చే జీతం ఎంతని చూడకుండా, సోమరిగా కూర్చోక ఉద్యోగం చేస్తున్న వారిని అభినందించటం పోయి విమర్శలు చేసి వారికి ఉద్యోగం మీద విరక్తి పుట్టే విధంగా చేయటం సరికాదు...తప్పు జరిగితే అక్కడ వారు వదిలి పెట్టరు కదా...ప్రభుత్వం కానీ,లోకల్ నాయకులు కానీ తప్పు కప్పి పెట్టాలని చూస్తే ప్రజల తీర్పు అదే రీతిలో ఉంటుంది...అత్త మీద కోపం దుత్త మీద సూపిన విధంగా ప్రభుత్వం మీది కోపం ఉద్యోగం చేసుకుంటున్న వారి మీద చూపటం బాగా లేదు...అసలు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న చాలా మంది జీతాలు గురించి కూడా పెద్ద సారు ఆలోచిస్తే బాగుండేది...ఇటీవలే ఆశ వర్కర్లుకి జీతాలు పెంచి నట్లు ముందు ముందు వీరికి కూడా జీతాలు పెంచుతారేమో చూడకుండా ముందే గగ్గోలు పెట్టటం మంచి పద్ధతి కాదు అని సిట్టి అభిప్రాయం..😢😢😢😢
అతని తండ్రి హీరో అయినా తండ్రి మాటకి విలువ ఇచ్చి చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన వ్యక్తి...అతను హీరో కాకపోయినా తమకి మాత్రం హీరోనే అని భావించి శోభన్ బాబు గారి కుమారుడు కరుణా శేషు గారికి ఆయన 60 వ జన్మదిన సందర్భంగా శోభన్ అభిమానులు చెన్నైకి వెళ్లి శుభాకాంక్షలు అందచేసి సారుకి సంతోషం కలుగ చేశారు... తండ్రి ఉన్నప్పుడు పెద్దగా బయటకి కనపడని కరుణ సారు తండ్రి అభిమానులని అక్కున చేసుకుని పుట్టిన రోజు ఘనంగా జరుపుకుని తండ్రి అభిమానులని ఆదరించిన కరుణకి సిట్టి శుభాకాంక్షలు అందచేస్తున్నాడు...😊😊😊👍👌👌💐💐💐🎂🎂🎂🎂🎂
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన మోడీ సారుకి ఆయన అభిమానులు లోక నాయకుడా, స్వాగతం,సుస్వాగతం అంటూ పాటలతో ఆడి, పాడి తమ భక్తి చాటుకున్నారని వార్త...రెండు రోజులు విశ్రాంతి తీసుకుని షా సారుకి చెప్పవలసింది చెప్పి మళ్ళీ ఎక్కడికి తుర్రు మంటారో అని సిట్టి ఎదురు చూస్తున్నాడు...😊😊😊😊😊
సిందంబరం సారు మళ్ళీ బెయిల్ కి అప్లై చేసి న్యాయ మూర్తి సారు తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ వేళ నాలో ఎందుకో ఆశలు అనే పాట పాడుకుంటూ జైలు నుండి బయట పడే శుభగడియల కోసం వేచి చూస్తున్నారు అని సమాచారం...😊😊😊😊
సిరంజీవి సారు చెప్పిన మాటలు కమల్ సారు సెవికి ఎక్కలేదు...ఇక్కడ సరే అక్కడ తన సాటి నటుడు విజయకాంత్ స్థితి చూసి కూడా ఆయన ఆలోచన చేసి ఉండవలసింది... అమ్మ,కరుణానిధి సారులు స్వల్ప వ్యవధిలో వెనుతిరగటంతో కొత్త నీరు తమ లక్ పరీక్షకి సిద్ధం అయినట్లు కనపడుతోంది... తలచినదే జరిగినదా దైవం ఎందులకు అనే పాట తరువాత ఆయన పాడుకునే టైం వస్తది లే అని సిట్టి నా బుగ్గలు నిమిరి నువ్వు వేసి సూడు అని సెప్పాడు..😢😢😢😢😢
బతుకమ్మ పండుగ సంబరాలు సేసుకునే వేళ సాటి మహిళలతో ఆటా, పాటలతో సంబరాలు సేసుకోవలసిన సమయంలో ESI మందుల కుంభకోణంలో పెద్ద పోస్టులలో ఉన్న మహిళలు ఏసీబీ వలలో సిక్కి జైలుకి వెళ్ళటం సిట్టికి బాధ కలిగించింది...కనీసం అక్కడ సాటి మహిళలతో బతుకమ్మ పండుగ వారు జరుపుకునే విధంగా ఏర్పాట్లు సేస్తే వారికి పెబుత్వం ఊరట ఇచ్చినట్లు అవుతాది... ఓ బాటసారి ఇది జీవిత రహదారి ఎంత దూరమో, ఏది అంతమో అనే పాట గుర్తు సేసుకుంటూ సిట్టి ఈ రోజు వార్తలు ముగిస్తున్నాడు..
😊😊😊😊😊
Comments
Post a Comment