12 లక్షల ఉపాధి హామీ నిధుల  గోల్ మాల్!!*

*షాద్ నగర్ లో 12 లక్షల ఉపాధి హామీ నిధుల  గోల్ మాల్!!*


*పనులు చెయ్యకుండానే బిల్లులు లేపినా వైనం!!*


*చర్యలు తీసుకోవాలని కొందుర్గ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు!!*


*జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తాం ఆవేదనతో రైతులు గ్రామస్థులు!*


దొంగలు ,దొంగలు కలిసి గట్లు పంచున్న చందంగా మారింది అధికారుల తీరు,పనులు చేయకుండానే బిల్లులు  ఎత్తినా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీరిపై గ్రామస్థులు,మరియు  రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమారు 12,లక్షల ఉపాధి హామీ నిధులను పనులు చెయ్యకుండానే బిల్లులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ కు కూడా పిర్యాదు చేస్తామని అన్నారు..


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండలం వెంకిర్యాల గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలంలో భూమి చదును చేసినట్టు కంపచెట్లు తీసినట్టు రైతులకు తెలియకుండానే పనులు జరిగినట్టు గ్రామ (పిల్డ్ అసిస్టెంట్ )మరియు (ఏపీఓ)మరి కొంతమంది కుమ్మకై గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో పనులు జరిగినట్టు (మస్టర్)పై రాసి బిల్లులు లేపారని రైతులలు సొంత డబ్బులతో పనులు చేయించుకుంటే అధికారులు మాత్రం బిల్లులు లేపారు ఈ విషయం బయటికి తెలియడంతో  రైతులు సోషల్ ఆడిట్ వారికి పిర్యాదు చెయ్యడం జరిగిందని అయినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని  ఇట్టి రైతులు నష్టపోయిన ఆధారాల లిస్టును అటాచ్ చేసి కొందుర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు  ఈ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


*అస్సలు బిల్లులు ఎలా లేపారు..*


పనులు చెయ్యకుండా ఎలా బిల్లులు లేపారు ఎలా బిల్లులు విడుదల అయ్యాయి విరిపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిన పై స్థాయి అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇంత మోసం జరుగుతున్న సంబంధింత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని రైతులు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


*కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం!*


కొందుర్గ్ మండలంలోని వెంకీ ర్యాల గ్రామస్థులు ఇచ్చినా ఫిర్యాదుపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొందుర్గ్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు...


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్