అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి వేత
అమెరికా: అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాఫిక్ స్టాప్ వద్ద సందీప్ సింగ్ ధలివాల్ అనే అధికారి విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుకవైపు నుంచి ఆయనను కాల్చి చంపాడు. ఈ అధికారి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు.
ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పిన వివరాల ప్రకారం... విధుల్లో ఉన్న సందీప్ సింగ్ ఓ కారును ఆపాడు. అందులో ఓ పురుషుడు, మహిళ ఉన్నారు. కారును ఆపిన వెంటనే అందులో ఉన్న వ్యక్తి వెంటనే కిందకు దిగి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు సమీపంలోని షాపింగ్ సెంటర్ వైపు పరుగెత్తాడు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని గుర్తించామని అతడితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని సదరు అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. సందీప్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Post a Comment