మహారాష్ట్ర ఎన్నికలో TRS నుండి పోటీ చేయుటకు అవకాశం ఇప్పించని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ను కలసిన మహారాష్ట్ర నాయకులు


నిజామాబాద్ అర్బన్ MLA శ్రీ బిగాల గణేష్ గుప్తాని కలిసిన మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు..


-మహారాష్ట్ర లో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికలలో TRS పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మహారాష్ట్ర లోని నాందేడ్  జిల్లా కి చెందిన  సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేదార్ రాయ్ జి రావ్ పటేల్ కే గారు అర్బన్ MLA  బిగాల గణేష్    గుప్తాని  కలిసి విన్నవించారు.


- మా గ్రామలన్ని తెలంగాణ రాష్టానికి దగ్గరగా ఉన్నాయని కానీ మా గ్రామలు అభివృద్ధి కి నోచుకోవడం లేదన్నారు.


- తెలంగాణ రాష్టం లో అమలయ్యే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మా రాష్టం లో అమలు కావడం లేదన్నారు.


 -తెలంగాణ లోముఖ్యంగా రైతు లకు ఎకరానికి ఏడాదికి 10000/- రూపాయలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్,2 వేయిల రూపాయల ఫించన్ ఇస్తే  మహారాష్ట్ర లో కేవలం 6 గంటల కరెంట్ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.


- తెలంగాణ రాష్టం లో  ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవం జరిగితే KCR కిట్స్,  ఆడ బిడ్డలకి కల్యాణ లక్ష్మీ, పండుగలకి బట్టలు ఇస్తున్నారు. పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందిస్తూన్నారు. కానీ మా రాష్టం లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదు. తెలంగాణ లో రోడ్లు బాగున్నాయి కానీ మా దగ్గర ఇప్పటికి కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు.


-మా ప్రాంతం నుండి గోదావరి ప్రవహిస్తున్న తాగునీటి కి సాగు నీటి కి నీళ్లు లేని పరిస్థితి.సాగునీటి విషయం లో తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించారు.


- ఇటువంటి పరిస్థితి నేపథ్యం లో మా ప్రాంతం కూడా అభివృద్ధి లో సంక్షేమం లో ముందుకు వెళ్లేందుకు TRS పార్టీ తరపున నయిగాన్ -89 శాసన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని మా విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర    ముఖ్యమంత్రి వర్యులు  చంద్ర శేఖర్ రావ్ గారి కి ధృష్ఠికి తీసుక వెళ్లాలని కోరారు.
వీరి విన్నపానికి సానుకూలంగా స్పందించిన అర్బన్ MLA  బిగాల గణేష్ గుప్తా  ముఖ్యమంత్రి ష్ఠికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్