సిట్టిగాడి వార్త...వాత...😊😊😊

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊


వానా వానా వెల్లువాయే...అనే పాట పాడుకోవలసిన రోజులు ఇవి...ఏది రోడ్డు, ఏది నది అనేది తెలియకుండా ఉంది...సకల జాగ్రత్తలు తీసుకుని మీ జీవన పోరాటానికి కొనసాగించమని సిట్టి జాగ్రత్తలు సెపుతున్నాడు... 


గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు పూజకు వేళాయెనే ఇంటి ఇల్లాలు పూజ సేసుకుంటే...గుడి వెనుక నా స్వామి గుర్రమెక్కి పోతున్నాడు అనే పాటకి ఊపు తెస్తూ భోపాల్ పెద్ద తలకాయలని శృంగార ఊబిలోకి నెట్టింది అంట ఒక గడుసరి... సింహ భాగం బీజేపీ సార్లు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు అని వస్తున్న వార్తలు బట్టి తెలుస్తోంది...పెజా సేవకు,వారి సెలబ్రిటీ హోదాకి భంగం వస్తది అని సెప్పి పేర్లు బయట పెట్టంటం లేదు మీడియా వారు..ఎప్పుడూ ఉన్నదే కదా...


పెద్ద సారు ఊరు వాడ ఏకమై సిన్న సారు పాలన మీద గగ్గోలు పెడుతుంటే సిన్న సారు పలుకె బంగార మాయెరా అన్న విధంగా మౌనంగా ఉండి నవ్వే వాళ్లు  నవ్వని,ఏడ్చే వాళ్లని ఎడవని డోంట్ కేర్ అనే బాల మావయ్య పాట పాడుకుంటూ పాలన సాగిస్తున్నారు...తీర్పు ఇచ్చేది ప్రజలు కానీ వీరి తో నాకేంటి అన్న విధంగా సారు ముందుకు పోతున్నారు...


పిల్ల స్కూల్ ఫీజు కట్టమని గొడవ చేస్తోంది అని కూతురిని చంపి తండ్రి పరారీలో ఉన్నాడు అన్న వార్త   సిట్టికి వేదన కలిగించింది...ఆ బంగారుకి చదువు మీద ఉన్న శ్రద్ద చూసి ఎవరైనా ఈ విషయం బయటకి తీసుకు వచ్చినట్లు అయితే ఎంతో మంది దాతలు విద్యా దానం చేస్తున్న ఈ రోజులలో ఆ చిట్టి తల్లి ప్రాణం నిలుపుకునేది...


సైరా విడుదల సమయంలోనే అమిత్ సారుకి ఫాల్కే అవార్డ్ రావటం శుభ సూచికం...దీనిమీద చిత్ర యూనిట్ సముచితంగా స్పందించిన్నట్లు లేదు అన్నది సిట్టి అభిప్రాయం.తెలుగోడి సత్తా చాటడానికి  మరో చిత్రం ముందుకు వస్తున్న సమయంలో వారి కృషి విజయవంతం కావాలి అని కోరుకుందాం..


రీమిక్స్ చేసిన పాత క్లాసిక్ పాటలలో ఎల్లు వచ్చే గోదారమ్మ పాటకి వచ్చిన ఊపు ఏ పాటకి రాలేదు అన్నది సిట్టి అభిప్రాయం...నా తదనంతరం ఎవరైనా నన్ను గుర్తు పెట్టుకుంటారా అన్న శోభన్ గారి అనుమానం పటా పంచెలు చేస్తూ నిన్ను మరచి పోవాలని అనే ఆయన పాట ఆయనకే గుర్తు సేసారు అభిమానులు,సినీ ప్రేమికులు....మీ సిట్టి...😊😊😊😊


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్