అక్టోబరు ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లో పలు మార్పులు రాబోతున్నాయి. 

 


అక్టోబరు ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లో పలు మార్పులు రాబోతున్నాయి. 


డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ)లు కూడా మారనున్నాయి. 


అంటే డీఎల్, ఆర్సీలకు సంబంధించిన రంగు, డిజైన్, భద్రతాపరమైన అంశాలన్నీ మారనున్నాయి. 


కొత్త రవాణా చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 


ఈ క్రమంలోనే డీఎల్, ఆర్సీల విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. 


డీఎల్, ఆర్సీలు దేశమంతటా ఒకే మాదిరిగా ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. 


అంటే అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే డీఎల్, ఆర్సీల తయారీ విధానం, ఇతర ప్రమాణాలన్నీ ఒకే విధంగా ఉండబోతున్నాయి.


కొత్త ఫార్మాట్ ప్రకారం


డ్రైవింగ్ లైసెన్స్ లో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉండబోతున్నాయి. 


అంతే కాదు వాహనదారుడి బ్లడ్ గ్రూప్, లైసెన్స్ ఇచ్చిన తేదీ, అత్యవసర సమయంలో కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఉంటాయి.


కొత్తగా రాబోయే డీఎల్, ఆర్సీల వల్ల దేశంలోని ప్రతీ వాహనం, వాటి సొంతదారులు, డ్రైవర్లకు సంబంధించిన సమాచారమంతా ఒకే డేటాబేస్ లో స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. 


దీని వల్ల వాహనానికి, దాని డ్రైవర్ కు సంబంధించిన సమాచారం ఏ రాష్ట్రంలోనైనా సరే తెలుసుకునే అవకాశముంటుంది.


ఇక డీఎల్‌లలోని మైక్రోచిప్‌ల ద్వారా ఆ వాహనం డ్రైవర్ ఉల్లంఘించిన ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన పది సంవత్సరాల డేటాను పొందొచ్చు. 


క్యూఆర్ కోడ్ ద్వారా వాహనం, డ్రైవర్ కు సంబంధించిన డేటాను సెంట్రల్ డేటాబేస్ ద్వారా ఎక్కడనుంచైనా పొందొచ్చు. 


ఆర్సీలో వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తారు.


ఇదిలా ఉంటే ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్‌లున్న వారు కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లను ఎప్పుడు తీసుకోవాలన్న విషయమై మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి స్పష్టతా లేదు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్