*జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అల్లంనారాయణ* *అక్రెడిటేషన్ కార్డులను సెప్టెంబర్ 26వ తేదీ నుండి పొందవచ్చు*


*జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అల్లంనారాయణ*


జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మొట్టమొదటిసారి అక్రెడిటేషన్లను ఆన్ లైన్ లో ఇవ్వడం ఇంకొక ముందంజ అని, ఆన్ లైన్ లో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. ఇందుకు సహకరించిన మీడియా మిత్రులందరికీ, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు, సమాచార పౌర సంబంధాల అధికారులను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
బుధవారంనాడు సమాచార భవన్ లోని బోర్డురూమ్ లో రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ ద్వితీయ సమావేశం జరిగింది. అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన 943 ఆన్ లైన్ దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.                   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆన్ లైన్ దరఖాస్తులలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు ఇండిపెండెంట్, చిన్న పత్రికలు, కేబుల్ ఛానల్స్, ఏజెన్సీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్నారని, అర్హత గల జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డుల మంజూరీకి కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు. మొదటి సమావేశంలో నిర్ణయించిన మేరకు 2084 మంది జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్ కార్డులను సెప్టెంబర్ 26వ తేదీ నుండి సమాచార శాఖ కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డులను పొందవచ్చునని తెలిపారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులు అక్టోబర్ నెల నుండి 2021 సెప్టెంబర్ వరకు మనుగడలో ఉంటాయని తెలిపారు. వజ్ర, ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రత్యేక బస్సులలో కూడా బస్ పాస్ చెల్లుబాటు అయ్యే విధంగా ఆర్.టి.సి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ప్రక్రియ వల్ల అక్రెడిటేషన్లలో పూర్తి పారదర్శకత పాటించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అత్యధికంగా అక్రెడిటేషన్ల సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, వారికి కేటాయించిన రిజర్వేషన్లు మహిళా జర్నలిస్టులు లేనట్లైతే అట్టి ఖాళీలను భర్తీ చేయబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చిట్టచివరి జర్నలిస్టు వరకు కార్డులు ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని తెలంగాణ జర్నలిస్టులకు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ నమోదులో చిన్న చిన్న సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు చైర్మన్ నూతన అక్రెడిటేషన్ కార్డులను స్వయంగా అందజేశారు. 
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు విరాహత్ అలీ, బసవ పున్నయ్య, బైసా దేవదాసు, వి. సతీష్, కోటిరెడ్డి, ప్రకాశ్, గంగాధర్, కట్టా కవిత, సౌమ్య, కిరణ్ కుమార్ రెడ్డి, షాకీర్ అహ్మద్, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య, మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్