సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు
సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు
దురాజ్‌పల్లిలో ఘటన
ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడిన బస్సు
క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
సూర్యాపేటలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
పట్టణ శివారులోని దురాజ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.
వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Post a Comment