ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందన ఆందోళన వ్యక్తం చేసిసి మంత్రి జగదీష్ రెడ్డి.
ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందన ఆందోళన వ్యక్తం చేసిసిమంత్రి జగదీష్ రెడ్డి.
ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దీపికా యూగందర్ రావు,స్థానిక శాసనసభ్యుడు గాధారి కిశోర్ కుమార్ లతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను అమ్మ మనసుతో పోల్చారు. అంతటి పవిత్రమైన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్న విషయాన్ని విస్మరించరాదని ఆయన కోరారు.ఇంగ్లీష్ బాషా అన్నది అవసరం కోసమే నన్న విషయాన్ని గుర్తెరగాలని మంత్రి సూచించారు. తెలుగును నేర్చుకోవడం తో పాటు నేర్పాల్సిన బాధ్యత నేటి సమాజానికి ఉందన్నారు.
Comments
Post a Comment