భారత్‌కు పర్యాయ పదమే ఆరెస్సెస్, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ RSS గురించి మాట్లాడటంపై ఆ సంస్థ స్పందన


"భారత్‌కు పర్యాయ పదమే ఆరెస్సెస్"
౼ సహకార్యవాహ్ కృష్ణగోపాల్


ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మాట్లాడటంపై ఆ సంస్థ స్పందించింది. 


భారత్‌కు పర్యాయపదంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ మార్చారని, మేమూ అదే కోరుకుంటున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ కార్యవాహ కృష్ణగోపాల్ పేర్కొన్నారు.


 ఆరెస్సెస్ ఉగ్రవాదానికి వ్యతిరేకం కాబట్టే ఇమ్రాన్ తమను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఇమ్రాన్ తన ఉపన్యాసాన్ని ఆరెస్సెస్ గురించి చెబుతూ ముగించారని, ఇకపై కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని ఎద్దేవా చేశారు.
 
ఆరెస్సెస్ కేవలం భారత్ కోసమే పనిచేస్తోందని, భారత్‌లోనే పనిచేస్తోందని తేల్చి చెప్పారు. 


తమకు పాక్‌తో సహా ప్రపంచంలో మరెక్కడా శాఖలు లేవని తేల్చి చెప్పారు. సంఘ్ పై పాక్ ఎందుకు కోపంగా ఉంది? అంటే.... ఒకవేళ సంఘ్ పై పాక్‌కు కోపం ఉంటే భారత్‌పై కూడా కోపం ఉన్నట్లే లెక్క. 


ఎందుకంటే ఆరెస్సెస్, భారత్ రెండూ పర్యాయపదాలు అని  ఆయన తెలిపారు.
 
ఆరెస్సెస్, భారత్ రెండూ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ప్రపంచం కూడా ఇదే దృష్టి కోణంలో చూడాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 


ఈ దృష్టి కోణాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ వేదికపై చూపించారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 


ఆరెస్సెస్ పేరును ఇమ్రాన్  విశ్వవ్యాపితం చేస్తున్నారని కృష్ణగోపాల్  పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్