బీజేపీ తమ అభ్యర్థిని విరమించి మల్లన్నకు మద్దతు ఇవ్వండి ..:చెరుకు సుధాకర్.

బీజేపీ తమ అభ్యర్థిని విరమించి మల్లన్నకు మద్దతు ఇవ్వండి ..:చెరుకు సుధాకర్.



హుజుర్నగర్: తెలంగాణ ఇంటి పార్టీ మరియు ఇంటి పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంయుక్త ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్బంగా ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మన వర్గాలకు న్యాయం జరగాలంటే మల్లన్ననే గెలిపించాలని దొంగలు దొంగలు ఒక్కటై వస్తున్నారు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, ఈ ఉపఎన్నికతో ప్రజల ఆక్రోశాన్ని పాలకవర్గానికి తెలియజెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే కుటుంబ పరిపాలన కాదని అయితే రాష్టంలో కెసిఆర్ కుటుంబం లేకుంటే హుజుర్నగర్ లో ఉత్తమ్ కుటుంబం తప్ప రాజకీయాలు ఎవ్వరు చెయ్యొద్దని విధంగా చెయ్యడం సరికాదని హితువు పలికారు. బీజేపీ దిద్దుబాటు చర్య చేసి బిసి అభ్యర్థిని నిలిపిన సమయం దాటిపోయిందని తాము విరమించుకునే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పారు . బీజేపీ తమ అభ్యర్థిని విరమించుకొని మల్లన్నకు మద్దతివ్వాలని కోరారు.


తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ: నేను వచ్చింది రెండు లక్షల ప్రజలను గెలిపించడానికని, ఉత్తమ్ కెసిఆర్ ఇద్దరు తోడుదొంగలు వీళ్ళ బాస్ మై హోమ్ రామేశ్వర్ రావు  అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్