జాతిపిత మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు
ఆర్యవైశ్య సంఘం నల్గొండ ఆధ్వర్యంలో
జాతిపిత మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు
2 అక్టోబర్ 2019 రోజున ఉదయం 9 గంటలకు స్థానిక వాసవి భవన్లో మహాత్మాగాంధీ 150వ జయంతిని ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుచున్నామని ప్రోగ్రాం కన్వీనర్లు. నాంపల్లి నరసింహ, దుండిగల్ల ఓంప్రసాద్, బెలిదే వెంకన్న, గుండా కరుణాకర్లు తెలుపారు. తొలుత మహాత్మా గాంధీ, కస్తూరిభా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ చేయబడునని తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటలకు క్లాక్ టవర్ (పెద్ద గడియారం) సెంటర్లో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు..
అందురు కార్యక్రమాలకు హాజరై మహాత్మాగాంధీ కి నివాళులు అర్పించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు
Comments
Post a Comment