ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించిన డాక్టర్ లక్ష్మీప్రసన్న
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం పరిధిలోని వాయిల సింగారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని డాక్టర్ లక్ష్మీప్రసన్న బుధవారం పరిశీలించారు గర్భిణీలకు మరియు చిన్నారులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు సిబ్బంది గ్రామాలలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని కోరారు అనంతరం గ్రామంలో రోగులను పరిశీలించారు. టీ బి అనుమానిత లక్షణాలున్న వ్యక్తులు గ్రామానికి సంబంధించిన ఆరోగ్య కార్యకర్తల వద్ద ఆశా కార్యకర్తల వద్ద ఉచిత టీబి పరీక్షలు చేయించుకోవాలని అని కోరారు ఎడతెరిపి లేకుండా దగ్గు మరియు జ్వరంతో ఉన్న వారు ఎక్కువగా తేమడ లేదా కల్లె వస్తున్న వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు . క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దోమకాటు వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కావున పరిసరాల పారిశుధ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అని కోరారు ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలోని ప్రజలకు సూచనలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు వెంకమ్మ రేణుక ఆరోగ్య కార్యకర్తలు కిరణ్, ఆశా కార్యకర్తలు మరియమ్మ మరియు ప్రజలు పాల్గొన్నారు*
Comments
Post a Comment