గిరిజన మహిళ పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై చర్యలకు ఆదేశించిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ .
సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, హర్షగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ముడావతి తిరుపతి,పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదేశించారు.
మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంతో పాటు వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు ఐపీసీ 376(D), 342,324,506 r/w34 సెక్షన్ల కింద నమోదు చేశారు. బాధితులను దవాఖానాకు పంపించి తగిన వైద్యం అందిస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తక్షణమే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Post a Comment