మెదక్ లో త్వరలో సిపెట్ కేంద్రం ఏర్పాటు –సదానంద గౌడ సిపెట్-చర్లపల్లి లో నూతనం గా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

మెదక్ లో త్వరలో సిపెట్ కేంద్రం ఏర్పాటు –సదానంద గౌడ
సిపెట్-చర్లపల్లి లో నూతనం గా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి



మెదక్ లో సిపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) నూతన కేంద్రం రానున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ప్రకటించారు. రూ . 58.32 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ సంస్థ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తితో  భరిస్తాయి. ఈ సంస్థ ఏర్పాటుకు భూ సేకరణ జరిగినట్లు మంత్రి తెలిపారు . ఈ కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్,  గ్రాడ్యూయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్ డి కోర్సులను అందిస్తుందని మంత్రి తెలిపారు.


సిపెట్- చర్లపల్లి వద్ద నూతనంగా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి  ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వసతిగృహంలో 145 గదులు ఉన్నాయని, 450 మంది విద్యార్థులు ఉండే సామర్థ్యం కలిగివుందని అన్నారు.  దీని వల్ల  పాలిమర్ టెక్నాలజీలో విద్యను అభ్యసించే విద్యార్థులను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.


సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు శ్రీ సదానంద గౌడ తెలిపారు. అక్టోబర్ 2 లోగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని మంత్రి చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ, అటువంటి ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని , ఎందుకంటే అవి ప్రతిచోటా చెత్తకుప్పలుగా ఉండి సరిగా రీసైకిల్ చేయబడవు అని మంత్రి అన్నారు . ప్లాస్టిక్‌ను మానవ జీవితంలోని ప్రతి రంగాలలోనూ, ప్యాకేజింగ్, ఆటోమొబైల్స్, వ్యవసాయం, మెడిసిన్ వంటి అనేక ఆర్థిక రంగాలలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ పరిశ్రమలో 4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని ఆయన అన్నారు.


భారతదేశంలో ప్రతిరోజూ సుమారు 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి తెలియజేశారు. ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయడానికి నూతన మరియు సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సిపెట్‌కు ఆయన సూచించారు.


రసాయనాలు మరియు ఎరువుల శాఖ, సిపెట్ ద్వారా 80 ప్రదేశాలలో సామూహిక శుభ్రత డ్రైవ్, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, పిల్లల కోసం పోటీలు నిర్వహించడం, ఎగ్జిబిషన్లు నిర్వహించడం, రీసైక్లింగ్ , చెత్త పారవేయడంపై వీడియోలను ప్రదర్శించడం, పిల్లలతో ర్యాలీలు, మరియు శ్రమ్‌దాన్ వంటివి నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న రోడ్లపై ప్లాస్టిక్ పదార్థాలను చెత్త బుట్టలో వేయాలని ఆయన ప్రజలను కోరారు.


సిపెట్: సిఎస్‌టిఎస్ హైదరాబాద్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా, పిజి డిప్లొమా కోర్సులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఇతర రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. డిజైన్, టూలింగ్ మరియు అచ్చు తయారీ, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్, ఐటి, ప్యాకేజింగ్ మరియు టెలిట్రోనిక్స్ వంటి ముఖ్య రంగాలకు ప్లాస్టిక్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో సాంకేతిక సేవలను సిపెట్ అందిస్తుంది.


శ్రీ ఎ రేవంత్ రెడ్డి,  మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు , శ్రీ బి. రామమోహన్, మేయర్, హైదరాబాద్, శ్రీ బి. సుభాష్ రెడ్డి, శాసన సభ్యులు, ఉప్పల్, శ్రీ ప్రభాకర్, మాజీ శాసన సభ్యులు,  భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ శ్రీ కాశీనాథ్ ఝా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్