కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు అక్రమాలపై, గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరిన బీజేపీ నాయకులు
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా... అక్రమాలకు పాల్పడుతోన్న గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ నేతృత్వంలోని బృందం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతనిధులు కొల్లి మాధవి, ఎన్.వి.సుభాష్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment