Posts

Showing posts from October, 2019

*ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోది ప్రశంస..*

*అమరావతి:* *ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోది ప్రశంస..* గుజరాత్ లో వడోదరలో పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు.. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల స్టాల్స్ ఏర్పాటు.. *ప్రత్యేక ఆకర్షణగా ఏపీ పోలీస్ స్టాల్* స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ,ఫేస్ రికక్నైజేషన్, ఈ విజిట్,  డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మొనిటరింగ్ సిస్టమ్ లతో స్టాల్స్ ఏర్పాటు.. *ఏపీ స్టాల్ వద్ద ప్రత్యేక పోలీస్ విధానంపై ఆసక్తి కనబరిచిన ప్రధాని..* స్పందన, వీక్లీఆఫ్ సిస్టమ్ పై వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోది.. స్పందన, వీక్లీ ఆఫ్ ల పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్దాయిలో వివరాలు అందజేయాలని కోరిన ప్రధాని మోడీ నేటి నుండి నవంబర్ -- వరుకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.

**సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఎ.సి.బి దాడులు**

కర్నూలు  డోన్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఎ.సి.బి దాడులు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన డోన్ సబ్ రిజిస్ట్రర్ నాగన్న డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా రహీంతో కలసి సబ్ రిజిస్ట్రర్ నాగన్న లంచం తీసుకున్న వైనం 17 వేలు లంచం డిమాండ్ చేసి 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్న ఏ.సి.బి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తున్న డాక్మెంట్ రైటర్లు  పరిధిని దాటి డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తున్నారు ఏ.సి.బి డి.ఎస్.పి నాగభూషణం ఏకకాలంలో రెండు చోట్ల సోదాలు డోన్ సబ్ రిజిస్ట్రర్ నాగన్న ఇంట్లోన,సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలోన సోదాలు డోన్ సబ్ రిజిస్ట్రర్ కార్యరాలయంలోను, ఇంట్లోను కొనసాగుతున్న ఎసిబి సోదాలు వెల్దుర్తి మండలనికి చెందిన  భాదితులు తండ్రి రామతిమ్మా రెడ్డి ,కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి లు 10 ,000 లంచం ఇస్తుండగా  సబ్ రిజిస్ట్రర్ నాగన్న, డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా రహీం పట్టుకున్నా ఏ.సి.బి సబ్ రిజిస్ట్రర్ నాగన్న భారీ, కొడుకు పేరుతో కర్నూలు 10 సెంట్ల స్థలం, తిరుపతిలో అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్, భార్య పేరున 11 సెంట్ల స్థలం గుర్తించిన ఏ.సి.బి అధికారులు ఇంకా కొనసాగుతున్న సోదాల

*దాన్యం సేకరణ, కొనుగోళ్లపై కాల్ సెంటర్ ప్రారంభించిన ఇంఛార్జి కలెక్టర్*

Image
*దాన్యం సేకరణ, కొనుగోళ్లపై కాల్ సెంటర్ ప్రారంభించిన ఇంఛార్జి కలెక్టర్* నల్గొండ, అక్టోబర్ 31.ఖరీఫ్ 2019-20 సీజన్ కు సంబందించి ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కాల్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జిల్లా లో ఖరీఫ్ దాన్యం సేకరణకు 100 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, దాన్యం రాకను అనుసరించి ఇప్పటికే జిల్లాలో 33 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండీ వరి ధాన్యం మద్దతు ధర కు కొనుగోళ్లు ప్రారంభమైనట్లు వెల్లడించారు. దాన్యం కొనుగోళ్లు,సేకరణ లొ సమస్యలు,ఎటువంటి ఫిర్యాదులు వున్నా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ 18004251442 టోల్ ప్రీ నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. కాల్ సెంటర్ లో దాన్యం కొనుగోళ్లు లో పాలు పంచుకునే అన్ని శాఖలు వ్యవసాయ శాఖ,మార్కెటింగ్,పౌర సరఫరాల శాఖ,జిల్లా పౌర సరఫరాల సంస్థ,తూనికలు కొలతలు శాఖలు,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,సహకార శాఖ,కార్మిక శాఖ,రైస్ మిల్లర్ అసోసియేషన్ నుండి ప్రతి నిధులు ...

*జాతీయ ఐక్యత,సమగ్రతకు అంకితం కావాలి:ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్*

*జాతీయ ఐక్యత,సమగ్రతకు అంకితం కావాలి:ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్* * జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతిఙ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ నల్గొండ,అక్టోబర్ 31.జాతీయ సమైక్యత, సమగ్రత,భద్రతను కాపాడేందుకు అంకితం కావాలనీ ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కాద్యాలయం లో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించి జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో ఇంఛార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పరంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుపొందారని ఆయన అన్నారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుందని అన్నారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆ...

*పోలీసులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పిర్యాదు*

*సైబర్ క్రైం పోలీసులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పిర్యాదు* *తనకు 15  ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన సీఈఓ రజత్ కుమార్*

పవన్ కళ్యాన్ని కలసిన ఆర్టీసీ జేఏసీ నేతాళి

Image
పవన్ కళ్యాన్ని కలసిన ఆర్టీసీ జేఏసీ నేతాళి

**బ్రేకింగ్ న్యూస్* *తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..**

🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧 *బ్రేకింగ్ న్యూస్* *తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..*  *దూసుకొస్తున్న 'క్యార్' .* తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.  అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులను అప్రమత్తం చేసింది. అరేబియా సముద్రంలో తుఫాను హరికేన్‌గా మారి ఒమన్ నుంచి భారత్‌కు కదులుతోంది ఈ తుఫానుకు 'క్యార్' అని నామకరణం చేశారు.  రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ, శాఖ తెలిపింది దేవేంద్ర జర్నలిస్ట్.

నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాకు హైకోర్టులో ఊరట...

*టీఎస్ హైకోర్టు.....* నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాకు హైకోర్టులో ఊరట... నయీమ్ భార్య సయ్యద్ సుల్తానాపై ఇప్పటికే పిడీ యాక్ట్ నమోదు చేసిన రాచకొండ పోలీసులు... చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సయ్యద్ సుల్తానా... పోలీసులు నమోదు చేసిన  పిడీ యాక్ట్ పై డిటక్షన్ ఆర్డర్ పాస్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన నయీమ్ భార్య... పీడీ యాక్ట్ పై పోలీసులు పాస్ చేసిన డిటక్షన్ ఆర్డర్ రద్దు చేసిన హైకోర్టు... చంచల్ గూడ జైలు నుండి త్వరలో విడుదల కానున్న నయీమ్ భార్య...

నేడు సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి

నేడు సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి స్వాతంత్ర్య సమర యోధుడు, స్వరాజ్య ఏకీకరణ చేసినవారు భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగినసత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించా...

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు

న్యూఢిల్లీ :  రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం గురువారం వెల్లడించింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.  అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తిరువనంతపురంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.  భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వి. నారాయణస్వామి చెప్పారు.

**కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా**

కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా హైదరాబాదు: కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా పడింది. కోతిపిల్లకు విముక్తి లభించింది. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా, పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు కుమారుడు (12)తో కలిసి మల్లాపూర్‌లో ఉంటున్నారు. నగరంలో గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ల కుమారుడు మంగళవారం కోతి పిల్లను గొలుసుతో కట్టి ఆడిస్తూ భిక్షాటన చేస్తూ జంతువుల పట్ల దయగల సమాజం (కంపాశనేట్‌ సొసైటీ ఫర్‌ అనిమల్స్‌) ఫౌండర్‌, ఛైర్‌పర్సన్‌ నాగారం ప్రవళ్లిక కంటపడ్డాడు. కోతిపిల్లను గోలుసులతో బంధించడమే కాకుండా బాలుడు భిక్షాటన చేయడంపై ఆమె స్పందించారు. ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకొని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు బాలుడి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు రప్పించి వారందరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కోతిపిల్లతోపాటు బాలుడు, అతడి తల్లిదండ్రులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. విచారణ జరిపిన అధికారులు బాలుడి కుటుంబానికి రూ.10వేల జరిమానా విధించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వద...

ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల సంఖ్య పెరగడంతో స్థలం సరిపోక చెట్ల కింద చికిత్స

  వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో విపరీతమైన డెంగ్యూ రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యం చేసేదిలేక స్థలం సరిపోక చెట్ల కింద ఆరుబయట గొడుగులను ఏర్పాటుచేసి రోగులకు చికిత్స చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్స చేసి ప్రజల ఆరోగ్యం విషయంలో తగు చర్య తీసుకోవాలని మిషన్ డాక్టర్ అవినాష్ తెలిపారు రోగుల సంఖ్య పెరగడంతో మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా మా ప్రయత్నం గా చికిత్స చేస్తున్నాం  స్థలం సరిపోకపోవడంతో గొడుగులను ఏర్పాటుచేసి ప్రత్యేకమైన మంచాలు ఏర్పాటుచేసి చికిత్స నిర్వహిస్తున్నామని అన్నారు

బైకు ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...

హైదరాబాద్  :  పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డు వద్ద బైకు ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... భార్య, భర్తలు మృతి.. మృతులు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ గ్రామానికి చెందిన దంపతులుగా గుర్తింపు

నల్గొండలో మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర

Image
నల్లగొండ పార్లమెంట్లో  మహాత్మా గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ గారు 'రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహా రెడ్డి గారు, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ గార్లపాటి జితేంద్ర కుమార్ గుప్తా గారు , నల్గొండ పార్లమెంట్ ,జిల్లా రాష్ట్ర నాయకులు,కార్యకర్తలు  తదితరులు....

ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ .

Image
ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ . భారతదేశం మొత్తం భద్రాద్రి వైపు చూసేలా గా అభివృద్ధి సాధించాలి ప్లాస్టిక్ నిషేధం లో ...జె డి లక్ష్మీనారాయణ , ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ . ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం లో భద్రాచలం పట్టణం ముందు వరుసలో ఉండగా దేశం మొత్తం భద్రాద్రి వైపు చూసే లాగా భద్రాద్రిని అభివృద్ధి చేసి చూపించాలని అభిలాషించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ .బుధవారం ఉదయం ఆయన భద్రాచలం పట్టణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ప్లాస్టిక్ నిషేధం పై ప్రగతిని సమీక్ష నిర్వహించిన ఆయన భద్రాచలంలో పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా పలు ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమాలను చేపట్టారు మొదటగా ఉదయపు నడక ప్రారంభించి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి చెత్తను, ప్లాస్టిక్ వ్యర్ధాలను భద్రాచలం పట్టణంలోని వాకర్స్ క్లబ్ లో ఉన్న సభ్యులు మరియు పట్టణ ప్రజలు ప్రముఖుల సహకారం తో తొలగించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు ...

**కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారు.**

అమరావతి: *ఏసీబీ అధికారులపై డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్.* *పిల్లి సుభాష్ చంద్రబోస్, డెప్యూటీ సీఎం.* కామెంట్స్ యధాతదంగా *కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారు.* అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణం. *ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.* ఏసీబీ డీజీతోనూ.. హోం మంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడాను. *ఈ కేసు విషయంలో విచారణే అవసరం లేదు..  పూర్తి సాక్ష్యాధారాలున్నాయి.* తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారుల మీదా అలాగే కేసులు పెట్టాలి. *తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి.. సస్పెండ్ చేయాలి.* లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..? *ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. మా శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.* *విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నాం.*

**జ్యోతి విలేకరి హత్యకేసు-సంచలన విషయాలు**

జ్యోతి విలేకరి హత్యకేసు-సంచలన విషయాలు* ఆంద్రజ్యోతి తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది. సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ (గౌరీ), మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయిస్తానని మృతుడు సత్యనారాయణ బెదిరించి, రూ.మూడు లక్షలు డిమాండ్‌ చేశాడు. భయపడిన గౌరీ రూ.రెండు లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్‌ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకుని పదకం ప్రకారం హత్య చేసినట్లు తేలిందని ఎస్పి చెప్పారు. ఎస్‌.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్‌.అన్నవరాని...

**_బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం? _**

_బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం? _ _దిల్లీ: బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అలాంటి బంగారంపై పరిమితుల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట. అంతకంటే ముందు ఒక కొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం ఇప్పటి వరకు లెక్కల్లో చూపని పసిడిని బహిర్గతం చేసి 'పన్ను' చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం._ _ఈ పథకం కింద వ్యక్తులు వద్ద పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట. 2014-16 మధ్యలో ప్రభుత్వం నల్లధనంపై ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకాల మాదిరిగానే ఇది కూడా ఉండవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాంపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది._దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు 2016లో పెద్ద నోట్లను రద్...

**మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌**

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌ అనంతపురం:   టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్‌ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు.  అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్‌ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్‌ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్‌, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

**ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం**

వరంగల్ రూరల్ జిల్లా:- *ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం* నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ధ దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనం అయ్యారు. తండాకు చెందిన భూక్య ధస్రు(68). బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనమయ్యారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతై పోయింది. సంఘటన స్థలికి నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

**నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో  ఉంచినా చర్యలు***

అమరావతి నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో  ఉంచినా సదరు వ్యక్తులు సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలు కల్పించిన ప్రభుత్వం  ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు స్పష్టం చేసిన సమాచార పౌరసంబంధాల శాఖ  సంబంధిత శాఖల కార్యదర్శులు దురుద్దేశపూర్వక, నిరాధారమైన వార్తలకు రిజాయిండర్లను జారీ చేయటంతో పాటు ఫిర్యాదు చేసేందుకూ అధికారాలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

**ఢీ కొట్టిన డీసీపీ వాహనం... ***

చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కారును వెనకనుంచి ఢీ కొట్టిన డీసీపీ వాహనం... ముందు కారులో ఉన్న భార్యా భర్తలను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన పోలీసులు.. 2 గంటలుగా స్టేషన్లో కూర్చోపెట్టి డీసీపీ వాహనం రిపేర్ చేపిస్తం అంటేనే బయటకు పంపుతామంటున్న పోలీసులు...

**ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్**

Image
*ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్* - - చెర్వుగట్టు వద్ద మూసివేసిన వ్యాపారస్థుల విజ్ఞప్తి మేరకు తిరిగి తెరుస్తామని హామీ - - వ్యాపారస్థుల ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్గొండ : కార్తీకమాసం దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు, వ్యాపారస్థులు భాగస్వామ్యం వహించాలని అప్పుడే సత్ఫలితాలు సాధ్యమని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. బుధవారం నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో మూసివేసిన రోడ్డును తిరిగి తెరవాలని వ్యాపారస్తులు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ద్వారా జిల్లా ఎస్పీ రంగనాధ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం చెర్వుగట్టును సందర్శించిన ఎస్పీతో వ్యాపారస్తులు మాట్లాడుతూ కార్తీకమాసం దృష్ట్యా చెర్వుగట్టు క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రోడ్డును మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తమ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని వారు ఎస్పీకి విన్నవించారు. రోడ్...

**అధిక ధర ఎందుకివ్వాలి.. అని ప్రశ్నించిన వ్యక్తి పై వైన్స్ నిర్వాహకుడి దాడి..!?**

*అధిక ధర ఎందుకివ్వాలి.. అని ప్రశ్నించిన వ్యక్తి పై వైన్స్ నిర్వాహకుడి దాడి..!?* *బీర్ బాటిల్ తో విచక్షణారహితంగా దాడి*  *యథేచ్ఛగా అధిక వసూళ్ల దందా*... *ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.!?* *నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న అధికారులు...* మహబూబాబాద్ : గూడూరు మండల కేంద్రంలోని స్థానిక గంగా వైన్స్ లో మద్యాన్ని అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన మద్యం ప్రియుడిని బీర్ బాటిల్ తో కొట్టి గాయపర్చిన గంగా వైన్స్ నిర్వాహకుడు.   ఇదిలా ఉండగా...ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ లలో దాదాపుగా ఇదే పరిస్థితి దాపురించింది. అడిగే పరిస్థితి లేదు... (ఏదేని ఓ వైన్ షాప్ కి వెళ్లి చూడొచ్చు).  అధికారులు ఉన్నారా అసలు అనే అనుమానం కలుగక మానదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు నిత్యకృత్యం అయ్యాయి.   సంబంధిత అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.                

**దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు**

దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు హైదరాబాదు కు చెందిన *కలర్స్ హెల్త్ కేర్* సంస్థ ల్లో అధికారుల తనిఖీలు హైదరాబాదు తో పాటు 49 చోట్ల ఒక్కసారిగా ఐటీ సోదాలు

*బాలిక చివరికోరిక తీర్చిన పోలీసులు*

*బాలిక చివరికోరిక తీర్చిన పోలీసులు*  హైదారబాద్: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక చివరి కోరికను రాచకొండ పోలీస్ కమిషనర్ తీర్చారు. ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన రమ్యా ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. ఆమెకు ఒక రోజైన పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించాలనే కోరిక ఉంది. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ రాచకొండ సిపి మహేష్ భగవత్‌కు తెలపడంతో అంగీకరించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రమ్యా నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కార్యాలయంలో ఒక రోజుల సిపిగా వ్యవహరించారు. ఆమెకు సిపి మిగతా పోలీసులు సాదరంగా ఆహ్వానం పలికారు.నర్సింహ, పద్మల కూతురు రమ్య బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. నిమ్స్‌లో చికిత్స తీసుకుంటోంది. ఈ సందర్భంగా రమ్యా మాట్లాడుతూ ఒక రోజు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని అన్నారు. రాచకొండ శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన సిపి మహేష్ భగవత్, అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరగా కోలుకోవాలని రాచకొండ పోలీసులు కోరారు. రాచకొండలో ఇది రెండవ సంఘటన గతంలో కూడా ఇషాన్ ఒక రోజు పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు.

125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి 

రూ. 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి    న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేశారు.  వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది పరమహంస యోగానంద 125 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరమహంస యోగానంద గారు యోగాకు చేసిన సేవలు అనిర్వచనీయం.  యోగాతో ఆమె ఎన్నో అద్భుతాలు చేశారు.  ఆమె యోగాకు చేసిన సేవలకు చిహ్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు.  కార్యక్రమంలో మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా ఉన్నారు.  పరమహంస యోగానంద గారు 5 జనవరి, 1893లో జన్మించారు.  ఆమె ఓ యోగి, మరియు యోగా గురు.  క్రియా యోగాను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు.  ఆమె యోగోదా సత్సంగ సొసైటీని ప్రారంభించి చాలా మందికి ఉచితంగా యోగా శిక్షణనిచ్చారు.  ఆమె 1952లో మరణించారు.

కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్‌ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్‌ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్‌ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్‌  పథకం పన్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. 'మా నాన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎలక్ట్రికల్‌ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది' అని కీర్తి ముందు శశి బిల్డప్‌ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిన...

*వైద్య సేవలు అందించటంలో ఘోరంగా విఫలమైన ఎన్నారై ఆసుపత్రి*

  *వైద్య సేవలు అందించటంలో ఘోరంగా విఫలమైన ఎన్నారై ఆసుపత్రి* *రాత్రి సమయంలో కనీస సౌకర్యాలు అందించటంలో వైఫల్యం కారణంగా ఓ వ్యక్తి మృతి* *వైద్య వృత్తికి కళంకంగా ఆ ఆసుపత్రికి చెందిన కొందరు వైద్యులు* *గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంకు చెందిన ఓ వ్యక్తి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు, స్థానికులు సమీపంలోని ఎన్నారై ఆసుపత్రికి తీసుకువెళ్లితే సరైన సమయంలో వైద్యం అందించటంలో సదరు వైద్యులు చికిత్స చేయకపోతే ఆ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగిన సదరు ఆసుపత్రి వర్గాలు స్పందన కరువు. ఇదే సమయంలో ఆ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందో. రికమండేషన్ ఉంటే ఒకలా లేకపోతే మరోలా వైద్యం. సదరు వచ్చే రోగులకు ఆరోగ్య శ్రీ, ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్ లాంటివి  ఉంటే వాటిని వారు క్లైమ్ చేసుకుని, వారికి రిజెక్ట్ చేస్తు డబ్బు వసూలు చేసినట్లు బహిరంగంగానే విమర్శలు. ఇలాంటి ఘటనలపై వెంటనే వైద్య విధానం పరిషత్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విచారణ జరిపి బాదితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై అయిన వచ్చే రోగులకు వైద్యం సరైన రీతిలో అంద...

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో లోని అధికారులు సమన్వయంతో నివారణ చర్యలు తీసుకోవాలి

నల్గొండ, ఆక్టోబర్ 30.జిల్లాలో విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు జిల్లా లోని వివిధ శాఖల అధికారులు సమన్వయం,సహకారంతో విపత్తు,ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని విపత్తుల నివారణ నిపుణులు డా.కె.ఆర్.కె శాస్త్రి  అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో విపత్తుల నిర్వహణ పై వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన వివిధ విపత్తులు, ముందు జాగ్రత్త చర్యలు,విపత్తు నివారణ,పునరావాసం,విపత్తు లు తగ్గించేందుకు ,విపత్తు తర్వాత చేపట్ట వలిసిన చర్యలు,జిల్లా విపత్తుల నిర్వహణ ప్రణాళిక పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకషంగా వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ అథారిటీ,జిల్లా విపత్తుల నివారణ ప్రణాళిక రూపకల్పన అంశాలపై వివరించారు. విపత్తులు ,ప్రకృతి వైపరీత్యాలు,వరదలు, తుపాన్ లు సంభవించి నప్పుడు పొంచి ఉన్న ప్రమాదం,ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు, పునరావాస చర్యలు, విపత్తు తర్వాత చేపట్టవలసిన చర్యలు,నష్ట తీవ్రత ఇతర అంశాలు,వివిధ శాఖలు నిర్వహించ వలసిన చేపట్ట వలసిన చర్యలు శిక్షణ నిచ్చారు.జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ కి జిల్లా కలెక్టర్ చై...

కనిగిరి సిఐ బదిలీపై.. రోడ్డెక్కిన ప్రజా సంఘాలు !

  కనిగిరి సిఐ బదిలీపై.. రోడ్డెక్కిన ప్రజా సంఘాలు ! నిజాయితీకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా  అవినీతిని నిర్మూలించడమే ఆయన చేసిన తప్పా  కులాలను ....పెత్తందార్లను.. అవినీతి పరులను... పారదోలి నిజాయితీగా విధులు నిర్వహించటం ఆయన చేసిన తప్పా అంటూ కనిగిరి ప్రజాసంఘాలు రోడ్డెక్కారు  ప్రభుత్వం అవినీతి రహిత గా పాలిస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి కట్టుబడి పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు  తన సర్వీసులో తను చేసిన కార్యాలయాల్లో ఎక్కడైనా ఇన్ని  సంవత్సరాల్లో తనపై అవినీతి ఆరోపణ చూపించగలరని ప్రశ్నించారు  ఇలాంటి ఉత్తమ అధికారులను మా ప్రజాసంఘంలా పోరాటంలో నేనెప్పుడూ చూడలేదు వినలేదని అన్నారు  లక్కడి కప్పలు ఇంటిలిజెన్ ఒంగోలు ఎసిబిలో పనిచేసిన ఆయన గురించి తెలియాలంటే ఆయనతో పాటు చేసిన వారిని అడిగి తెలుసుకోండని ఆయన నిజాయితీ ఏమిటో తెలుస్తుందని తెలిపారు .   కనిగిరి c.i కోసం ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా రోడ్డెక్కి నిలబడటం ఆయన నిజాయితీకి నాంది పలికాయని  తెలిజేశారు  ఇలాంటి ఉత్తమ నిజాయితీ అధికారుల క...

పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో  మరో మలుపు

పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో  మరో మలుపు జయరామ్ హత్య కేసులో  నాంపల్లి కోర్టులో ప్రారంభమైన ట్రయల్  ఈ కేసులో కీలకం కానున్న  పోలిసుల పాత్ర ఫై విచారణ  ఈ  ఏడాది జనవరి 30 న  రాకేష్ రెడ్డి చేతిలో హత్యకు గురైన జయరాం నిందితుడు రాకేష్ రెడ్డి తో సంబందాల నేపధ్యంలో రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట  సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసిపి మల్లారెడ్డి ల పేర్లను చార్జిషీట్లో చేర్చిన పోలీసులు శాఖాపరమైన విచారణ నిలుపుదల చేయాలని ముగ్గురు పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్ జయరామ్ హత్య కేసులో సస్పెన్షన్ కు గురైన పోలీసు అధికారుల పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు కోర్ట్ విచారణ ను ఎదుర్కోవాల్సిందే నని స్పష్టం చేసిన హైకోర్టు పోలీసు అధికారులను విచారించనున్న నాంపల్లి కోర్ట్  రాకేష్ రెడ్డి తో సంబంధాల ఫై వాంగ్మూలాలను సేకరించనున్న కోర్ట్  మరో రెండు నెలల్లో  జయరాం హత్య కేసులో తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్ట్

ఆర్టీసీ బస్సు బోల్తా

Image
ఆర్టీసీ బస్సు బోల్తా .. పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు    గుంటూరు: ఫిరంగిపురం మండలం  మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా  పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు.  పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పిన పెను ప్రమాదం.  వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు  వర్షం కురుస్తున్న సమయంలో బస్సును వేగంగా నడపటంతో ఘటన చోటుచేసుకుంది.

నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర

Image
నల్గొండలో బిజెపి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాత్మా గాంధీ సంకల్పయాత్ర   నల్గొండలో నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తేదీ 30/10/2019 బుధవారం నాడు శ్రీ పచ్చల సోమేశ్వరాలయం పానగల్లు నుండి 8.30am గంటలకు ప్రారంభం అవుతుందని, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలంతా   ఈ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవం చేయాలని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రసాద్ కోరారు.

*వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.*

*వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.* ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజశంకర్‌ తెలిపారు. 9674 గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ◆ నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 10 వరకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ. ◆ నవంబర్‌ 11 నుంచి 15 వరకు దరఖాస్తుల పరీశీలన ◆ నవంబర్‌ 16 నుంచి 20 వరకు అభ్యర్దులకు ఇంటర్వ్యూలు ◆ డిసెంబర్‌ 1 నుంచి విధుల్లోకి కొత్తగా ఎంపికైన వాలంటీర్లు జిల్లాల వారీగా ఖాళీల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముందుగా అన్ని వాలంటీర్ల పోస్టులు భర్తీ చేశారు. కొంత మందికి సచివాలయ ఉద్యోగాలు రావడంతో మరికొంత మంది వ్యక్తిగత కారణాలతో వాలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో వాలంటీర్‌ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జగన్‌ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలుచేపట్టారు. *జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.* ★ శ్రీకాకుళం 200 ★ విజయనగరం 823 ★ విశాఖపట్నం 370 ★ పశ్చిమ గోదావరి 590 ★ తూర్పుగోదావరి 1861 ★ కృష్ణా 453 ★ గుంటూరు 919 ...

డిండి రిజర్వాయర్ లో  14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను  విడుదల చేసిన మంత్రి తలసాని

Image
డిండి రిజర్వాయర్ లో  14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను  విడుదల చేసిన మంత్రి తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత  ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతాంగానికి,వివిధ వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం గుండ్ల పల్లి మండల కేంద్రంలో  డిండి రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు.అనంతరం మార్కెట్ యార్డులో పశు ప్రదర్శన,లేగ దూడలు ప్రదర్శన ప్రారంభించి  24 మందికి రెండవ విడత గొర్రెల పంపిణీ,28 మందికి పాడి గేదెలు సబ్సిడీ పై పంపిణీ చేశారు.8 మంది గేదెలు చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కింద మళ్లీ ఉచితంగా గేదెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా స్వరాష్ట్రం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్య మంత్రిగా కె.సి.అర్ ఐదు సంవత్సరాలు గా ఎన్నో కార్య క్రమాలు,24 గంటలు కరెంట్ సరఫరా,రైతు బంధు కింద పెట్టుబడి సాయం కింద రైతులకు రెండు పంటలకు ఈ సంవత్సరం నుండి ఎకరానికి 10...

టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్‌ జాబ్‌కు  click  చేసి  అప్లై  చేసుకోండి. TSలో  970, AP లో 2707 పోస్టులు

టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్‌ జాబ్‌కు  click  చేసి  అప్లై  చేసుకోండి. TSలో  970, AP లో 2707 పోస్టులు టెన్త్  పాసయిన వారికి గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్  జారి చెందింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 5,476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేస్తోంది. ఇండియా పోస్ట్. ఇండియా పోస్ట్ చేపడుతున్న అతిపెద్ద నియామక ప్రక్రియ ఇది. ఇంతకుముందే దేశంలోని ఇతర సర్కిళ్లలో 10,000 పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసిన ఇండియా పోస్ట్... ఇప్పుడు మరో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15న, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా లేదా వెబ్‌సైట్‌లో 2019 అక్టోబర్ 15 నుంచి 2019 నవంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. *1. పేరు (10వ తరగతి మార్క్స్ మెమోలో ఉన్న పేరు) *2. తండ్రి పేరు *3. మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫ...

ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన

Image
ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను ప్రారంభించిన తెదేపా. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి దేవినేని ఉమా , ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు  బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజ గోపాల్ (తాతయ్య),శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు తెదేపా నేతలు.

బ్రేకింగ్, మున్సిపల్ ఎన్నికల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Image
బ్రేకింగ్ మున్సిపల్ ఎన్నికల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కు హైకోర్టు లో ఊరట.. మున్సిపల్ ఎన్నికల పై హైకోర్టు లో దాఖలైన పిటిషన్ లన్నింటిని కొట్టివేసిన హైకోర్టు.

బేగంపేట మెట్రో స్టేషన్‌కు  తాళం 

Image
  బేగంపేట మెట్రో స్టేషన్‌కు  తాళం  హైదరాబాద్‌ : బేగంపే ట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ సోమవారం చలో ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించారు.  కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీతో పాటు పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో  ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో   ఐదు నెలల చిన్నారి మృతి  ఆరుగురికి గాయాలు

Image
ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో  ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో   ఐదు నెలల చిన్నారి మృతి  ఆరుగురికి గాయాలు హైదరాబాద్‌: నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది  అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు.

*ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్* (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా)

Image
*ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్* (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా) టైమ్ తో పన్లేదు ఏరియాతో పన్లేదు. డేంజర్ అని తెలిస్తే.. అక్కడ అడ్డుగా నుంచునేది పోలీస్. రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీస్. బోర్డర్ నుంచి.. ఊళ్లకు వెళ్లే రోడ్ల వరకు అన్ని చోట్లా అండగా ఉండేది పోలీస్. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు.అన్ని ఏర్పాట్లు జరుగుతున్నయ్. అక్టోబర్ 21 కోసం అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు అధికారులు. చేతిలో లాఠీ. పాకెట్ లో గన్ను. వంటి మీద ఖాకీ డ్రస్సు.ఇంకేం అవసరం లేదు. స్కెడ్యూల్ తో పన్లేదు. టైం టేబుల్ అవసరం లేదు. ట్వంటీ ఫోర్ హవర్స్ ఆన్ డ్యూటీ. వంద నెంబర్ మోగొచ్చు. మోక్కపోవచ్చు. ఇన్ ఫర్మేషన్ వచ్చిందంటే చాలు.. ప్రమాదం ఉన్న ప్రతి చోటా ముందుగా ఉండేది పోలీసే.  ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు.ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానిక...

**హుజుర్నగర్  ఉప ఎన్నికకు  సర్వం సిద్ధం.**

హుజుర్నగర్  ఉప ఎన్నికకు  సర్వం సిద్ధం. ఎన్నికల కమిషన్   పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక   అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి  ప్రతి పోలింగ్ కేంద్రంలో  ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు... నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు.. ఇందులో 79 పోలింగ్ కేంద్రలను  సమసస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా sp భాస్కరన్  పర్యవేక్షణలో ప్రతి పోలింగ్ కేంద్రంలో  ASI  తో కూడిన బృందం విధులు నిర్వర్తిస్తున్నారు... మొత్తం 1500 మంది పోలీసులు  విధుల్లో వున్నారు... ఇక మరో 1500 మంది సిబ్బందిని పోలింగ్ కోసం  ఉపయోగిస్తున్నారు.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు... ప్రతి ఓటర్కు ఇప్పటికే  ఓటరు స్లిప్ లను పంపిణీ చేయగా, గుర్తింపు కార్డ్ చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు ఓటర్లను కోరారు.....

ఆటో డ్రైవర్ దారుణ హత్య

ఆటో డ్రైవర్ దారుణ హత్య పంజాగుట్టలోని నాగర్జున హిల్స్ సమీపంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ..పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు..రియసత్ అలీ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు  గత కొన్ని రోజుల క్రితం ఆటోడ్రైవర్ అన్వర్ తో  విభేదాలు ఏర్పడి గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు..గత కొన్ని రోజుల క్రితం అన్వర్ అలీ హత్య చేసి జైలుకు వెళ్ళాడు.. జైలుకు వెళ్ళిన అనంతరం ఐదు రోజుల కింద బెయిల్ పై విడుదలైన ఈ రోజు అతని చంపినట్లు పోలీసులు తెలిపారు ..ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో టీ తాగడం కోసం వస్తున్నా రియా సత్ అలీని పథకం ప్రకారం చుట్టుముట్టే ఐదు మంది చంపినట్లు పోలీసులు తెలిపారు..కత్తులు గోడ్డలను తీసుకువచ్చి అతని వెనుక నుండి పథకం ప్రకారం మట్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు  ..తమ స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య గల కారణాలను విచారిస్తున్నారు..ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సెర్చ్ ద్వారా పలు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు..హత్యకు గురైన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు..

**ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో

Image
ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో  సత్తుపల్లి  డిపో డ్రైవర్ యెస్ కె. ఖాజామియా సాలరీ రానందుకు గుండెపోటూతో  మృతి చిట్యల పట్టణ కేంద్రనికి చెందిన గొసుకోండ మల్లయ్య. నల్లగోండ RTC డిపోలో ADC గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం పోయినదని మనసాతపనికి గురై  హర్ట్ ఎటాక్ తో హైద్రబాద్ లోని గాంది హస్పటాల్ లో మృతిచెందడు.

చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...*

చంచల్ గూడ జైలులో మహిళ రిమాండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్...* ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జాయింట్ డైరెక్టర్ పద్మ... మనస్తాపానికి గురైన పద్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం... మహిళను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన జైలు అధికారులు... పద్మ ఆరోగ్య పరిస్థితి  విషమం... ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు...

హుజూర్ నగర్ మఠంపల్లి మండలం లో జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర  మంత్రి  కిషన్ రెడ్డి

Image
హుజూర్ నగర్ మఠంపల్లి మండలం లో జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర  మంత్రి  కిషన్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం హెడ్ కోటర్ జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి మరియు గడ్డం వివేక్  మరియు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు  యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ ఇంచార్జ్ కళ్యాణ్ నాయక్, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి భాగ్య రెడ్డి , భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావు , మఠంపల్లి మండల ఇన్చార్జి కళ్యాణ్ నాయక్ , మఠంపల్లి మండల అధ్యక్షులు మురళి  తదితరులు పాల్గొన్నరు 

కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.., ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం.. 

Image
ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం..  ఆర్టీసీ కార్మికులపై అణచివేతతో ఆగిన రథచక్రాలు.. సమ్మె సైరన్ తో స్తంభించిన కార్యకలాపాలు.. నియంత పోకడతో కేసీఆర్ సర్కార్ విచ్చుకత్తి.. ఉద్యమ ద్రోహుల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆగిన కార్మికుల జీవిత చక్రం. కార్మికుల పక్షాన నిలిచిన కమలదళం.. రాక్షసపాలనకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న లక్ష్మణ సైన్యం. కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.. ఆగిన బస్సు చక్రాలతో కారు టైర్ పంక్చర్.. కమలసేన ఎంట్రీతో కేసీఆర్ గుండెల్లో వణుకు.. ఇదీ 'సమ్మె'ట దెబ్బ. చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆగిన ప్రగతి రథ చక్రాలు.. వారి సమస్యల పరిష్కారం కోసం సైరన్ మోగించిన ఆర్టీసీ కార్మికులు.. సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరితో విసుగుచెందిన కార్మిక సంఘాలు. సాదాసీదాగా ప్రారంభమైన సమ్మెపై నియంత కేసీఆర్ సర్కార్ మొండివైఖరి ప్రదర్శించి ఉక్కుపాదం మోపింది. హక్కుల సాధన కోసం పోరు సాగిస్తున్న వారిపై దమనకాండ సాగించింది. సమ్మెను నీరుగార్చేందకు సర్వశక్తులూ ఒడ్డింది. ఉద్యమానికి దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్టి.. నిరంకుశంగా, రాజ్యాంగ విరుద్ధంగా సెల్ఫ్ డిస్మిస్ అంటూ కొలువుల నుంచి తీసే...

తెలంగాణ   భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత  కల్పించండి

Image
తెలంగాణ   భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత  కల్పించండి తెలంగాణ నుంచి  తిరుమల వచ్చే భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత కల్పించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. శనివారం జూబ్లిహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయనను  మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని అనుమానంతో చీమల మందు తాగిన మహిళ

Image
భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని అనుమానంతో చీమల మందు తాగిన మహిళ హైదరాబాద్ నారాయణగూడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ దగ్గర లో. తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతుండని  అనుమానంతో చీమల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన. నాగ లక్ష్మి అనే మహిళ.100కు డయల్ కు ఫోన్ చేసిన స్థానికులు. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు. బోడుప్పల్ చెంగిచెర్ల లో ఉంటున్న దంపతులు. నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు మొదటి భర్తని వదిలేసిన లక్ష్మి. ఉప్పల్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకున్న మహిళ. అపాయం ఏమీ లేదని తెలిపిన డాక్టర్లు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు

Image
  రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ బంద్‌కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్   తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 15 రోజుకు చేరుకోగా, నేడు కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్, ఆదిలాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, హైదరాబాద్‌లోనూ బంద్ కొనసాగుతోంది. నగరంలోని పలు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. మొత్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఆర్టీసీ  కార్మికులు   బందుకు  జర్నలిస్ట్ అసోసియేషన్  ఆఫ్ తెలంగాణ (జాట్) మద్దతు

Image
  ఆర్టీసీ  కార్మికులు  చేపడుతున్న బందుకు  జర్నలిస్ట్ అసోసియేషన్  ఆఫ్ తెలంగాణ (జాట్) సంపూర్ణ మద్దతు ఆర్టీసీ  కార్మికులు  చేపడుతు న్న  బందుకు  జర్నలిస్ట్ అసోసియేషన్  ఆఫ్ తెలంగాణ (జాట్) సంపూర్ణ మద్దతు తెలుపు తున్నదని అధ్యక్షుడు పగడాకుల బాలస్వామి తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్  చేస్తున్నామని అన్నారు.  తెలంగాణ  ఉద్యమంలో  ముందుండి పోరాడిన ఆర్టీసీ కార్మికుల హక్కులను  కాలరాయడం ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వానికి నిదర్శనంగా  జాట్ భావిస్తోందని, ఆర్టీసీ కార్మికుల విషయంలో పంతానికి పోయి ప్రజలను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కెసిఆర్ కు తగదని హెచ్చారంచారు.  బందులో జాట్ సభ్యులందరo పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు.    

సహోద్యోగి వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ...

Image
సహోద్యోగి వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన  గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌ అంకుర ఆస్పత్రి ఉద్యోగులే ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు  సూర్యాపేట:  కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్‌ వాసులు గల్లంతయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారిలో అబ్దుల్‌ అజిత్‌ (45), రాజేష్‌ 29), జాన్సన్‌ (33), సంతోష్‌ కుమార్‌ (23),నగేష్‌ (35) పవన్‌ కుమార్‌ (23) ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తదితరులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతయినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంకు...

*రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం*

  *రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం* ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి.  రాష్ట్ర బంద్‌కు కూడా రెవెన్యూ సంఘాలు సంఘీభావాన్ని ప్ర‌క‌టించాయి  ఉద్యోగులంతా భోజ‌న  విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీల‌ను ధ‌రించి రాష్ట్రంలో అన్ని త‌హ‌శీల్దార్, ఆర్డీఓ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు నిర‌స‌న తెలుపాల‌ని పిలుపునిచ్చాయి.  అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మ‌ద్ద‌తుగా చేప‌ట్టే  నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలని పిలుపునిచ్చాయి. *వి.ల‌చ్చిరెడ్డి,* రాష్ట్ర అధ్య‌క్షుడు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం- తెలంగాణ   *ఎస్‌.రాములు,* రాష్ట్ర అధ్య‌క్షుడు, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) *గ‌రికె ఉపేంద్ర‌రావు,* రాష్ట్ర అధ్య‌క్షుడు, టి.వి.ఆర్‌.ఒ.డ‌బ్య్లూఏ *ఎన్‌.ల‌క్ష్మినారాయ‌ణ‌,* రాష్ట్ర అధ్య‌క్షుడు, టి.వి.ఆర్‌.ఒ.ఏ *ఏ.బాల‌న‌ర్స‌య్య‌,* రాష్ట్ర అధ్య‌క్షుడు, టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ *సంతోష్‌,* టి.ఆర్‌.ఎస్‌.ఏ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి *వంగూరు రాములు,* రాష్ట్ర, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ *బి.సుధాక‌...

*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్*

Image
*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్* నల్గొండ : బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం చేసినప్పుడే అమరులకు నిజమైన నివాళి అని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా 12వ బెటాలియన్ పోలీసులు, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఎస్పీ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా పోలీస్ అమరుల వారోత్సవాలు నిర్వహించు కుంటున్నామని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ పేదలు, బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం అందించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. అమరుల త్యాగాల సాక్షిగా పేద ప్రజలకు అండగా ఉంటామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం న్యాయం పక్షాన నిలబడతామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హీరోలు చనిపోవచ్చు కానీ హీరోయిజం చనిపోదని అదే విధంగా అమరుల త్యాగాలు ఎన్నటికీ నిలిచే ఉంటాయని, వారి త్యాగం శాశ్వతని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ క్లాక్ టవర్ నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయ...

వనస్థలిపురం లో దారుణం...

వనస్థలిపురం లో దారుణం... నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్ట్మెంట్ 3వ అంతస్తు పై నుండి ప్రియురాలిని కొట్టి కిందకు నెట్టివేసిస ప్రియుడు... ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందిన ప్రియురాలు సీమ... పరారీలో ప్రియుడు దిలీప్.. కేసు నమోదు చేసుకుని ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు.. 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి వచ్చి వనస్థలిపురం శక్తి నగర్ లోని వాసవి నిలయం  భవనం నిర్మాణాల పనిలో చేరిన యువతి,యువకుడు

**ఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమించాలని సూచించిన తెలంగాణ హైకోర్టు **

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమించాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సమ్మెపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  పండుగలు, స్కూళ్ల సెలవుల సమయాల్లో సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించింది.  ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అయితే సమ్మె ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడింది.  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకుండా పోయాయన్నారు.  సమ్మె అనేది కార్మికుల ఆఖరి అస్త్రమని చెప్పుకొచ్చారు. సమ్మె చేయకపోతే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని తేల్చి చెప్పారు.  సమ్మె ...

*ఆర్య వైశ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు & అండర్ గ్రాడ్యుయేట్లకు VFE వారిచే  IES / GATE కోసం  ఉచిత కోచింగ్‌ *

Image
*ఆర్య వైశ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు & అండర్ గ్రాడ్యుయేట్లకు VFE వారిచే  IES / GATE కోసం  ఉచిత కోచింగ్‌ * Vasavi Foundation for empowerment (VFE)  -హైదరాబాద్  వారు  ACE ఇంజనీరింగ్ అకాడమీ సహకారంతో IES / GATE కోసం * ఉచిత * కోచింగ్‌ను  ఆర్య వైశ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మరియు 3 వ / 4 వ సంవత్సరం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్లకు  ఈ కోచింగ్ ను అందిస్తున్నారు. .  కోచింగ్‌కు ఎంపిక చేయడానికి ఆర్థికంగా  అర్హులైన & మెరిట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను    ఆహ్వానిస్తున్నారు. పరిమిత సీట్లు     ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చివరి తేదీ 19 అక్టోబర్ 2019  వివరాలకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఏదైనా స్పష్టత సంప్రదింపుల కోసం: శ్రీ టి. నాగేశ్వర రావు -8106610101 లేదా శ్రీ బి. సురేష్ -9848025584 లేదా శ్రీ సిహెచ్. జనార్థన్ రావు -9849948169 ల ని సంప్రదించవచ్చు.

టిక్ టిక్ టాక్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు

Image
ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు  తీసుకవెళతాం-టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా టిక్ టాక్ ఇండియా -  తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ, డిజిటల్ మీడియా  ఆధ్వర్యంలో హోటల్ హరిత ప్లాజాలో టిక్ టాక్ మీద తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రజా సంబంధాల అధికారులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా పరిధి రోజురోజుకూ విస్తరిస్తున్న సమయంలో ముఖ్యంగా టిక్ టాక్ యూజర్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. అనతికాలంలోనే  దేశంలో 20 కోట్ల మంది యూజర్లను చేరుకోగలిగింది అంటే టిక్ టాక్ ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు టిక్ టాక్ ఎంతో చేరువయింది. ఈ సందర్భంగా టిక్ టాక్ సమర్థ వినియోగం, పాలసీ విధానాలు, సురక్షా పద్ధతుల మీద టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్ వర్క్ షాప్ లో పాల్గొన్నవారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. గత మూడునెలలుగా టిక్ టాక్ ఇండియా,  కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తోందని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగా...

***హుజుర్నగర్ ఎన్నికలకు Trs కి మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ***

Image
****హుజుర్నగర్ ఎన్నికలకు Trs కి మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ*** ప్రెస్ నోట్ చదవండి.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కారు* *-టీయూడబ్ల్యూజే ధర్నాలో పలువురి ధ్వజం*

Image
*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కారు* *-టీయూడబ్ల్యూజే ధర్నాలో పలువురి ధ్వజం* హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించడం సహించరానిదని పలువురు ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మూడవ దఫా పోరుబాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) పిలుపు మేరకు హెచ్.యూ.జే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ సర్కారు నియంతృత్వ పోకడలను అవలంభిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగాలను, చివరికి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన జర్నలిస్టులకు ఎన్నో హామీలతో కేసీఆర్ మభ్య పెట్టి మోసగించడం విచారకరమన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. బ...

సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టి వేసింది.  సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలను నిరోధించే ఉద్దేశంతో ఈ పిల్‌ను సుప్రీంలో దాఖలు చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. కాగా, అన్ని విషయాలను సుప్రీం వరకు రావాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.  పిల్‌పై వాదనలు విన్ని సుప్రీం కోర్టు.. ''ఈ విషయం గతంలో మద్రాసు హైకోర్టు దృష్టికి వచ్చింది. ప్రతి విషయం సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదు'' అని అభిప్రాయపడింది.  నకిలీ ఖాతాలు, పెయిడ్ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయని, వాటిని నిరోధించాలంటే ప్రతి ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయాలని లాయర్, బీజేపీ నేత అశ్విణి ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి

Image
సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి.. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా అక్కడే ఉన్నారు. తాను కథానాయకుడిగా నటించిన 'సైరా:నరసింహారెడ్డి' చిత్రాన్ని వీక్షించాల్సిందిగా జగన్‌ను కోరారు. అనంతరం ఇరువురు కలిసి భోజనం చేశారు. చిరు ఇటీవల తెలంగాణ గవర్నర్‌ తమిళసైను కూడా కలిసి 'సైరా' చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి. కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ...

  శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి. కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ... బిజెపి మీడియా స్టేట్మెంట్ ...  పాయింట్స్    ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి  మరణించడం పట్ల బీజేపీ సంతాపం తెలియజేస్తుంది. ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడడం భాదకలిగిస్తుంది.   శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి  బీజేపీ అండగా ఉంటుంది.  శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి. 48000 మంది ఆర్టీసీ  ఉద్యోగులను తొలగించాలని కెసిఆర్  నిర్ణయం ప్రకటించి... తరువాత శ్రీనివాస్ రెడ్డి ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశారు.  శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు  సిఎం కెసిఆర్ ప్రేరేపిత కారణమని బీజేపీ భావిస్తుంది.   ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెంది ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ విజ్ఞప్తి చేస్తుంది.  ముఖ్యమంత్రి కెసిఆర్  అణచివేత పాలనకు వ్యతిరేకంగా ఐక్యతతో పోరాడటం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు కోపాన్ని  చవి...

ఏసీబీ కస్టడీలో రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు..!

ఏసీబీ కస్టడీలో రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు..! రెండు రోజుల అనుమతినిచ్చిన కోర్టు ఆదాయానికి మించి ఉన్న ఆస్తులే కారణం..!   హైదరాబాద్ : రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డికి రెండురోజుల అనిశా కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.   ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. చంచల్​గూడ జైలు నుంచి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి అతన్ని తరలించారు.   మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు...ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా గుర్తించారు.  ఇప్పటి వరకు 3కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి... రెండు  కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  

***బోటు వెలికితీతకు మరోసారి ప్రయత్నించనున్న ధర్మాడి సత్యం బృందం***

***బోటు వెలికితీతకు మరోసారి ప్రయత్నించనున్న ధర్మాడి సత్యం బృందం*** నెలరోజుల కిందట గోదావరిలో బోటు మునక ఇప్పటికీ గోదావరి గర్భంలోనే బోటు వెలికితీసేందుకు ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం బృందం మరోసారి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ను కోరిన ధర్మాడి సత్యం టీమ్ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటును వెలికితీసేందుకు మరోసారి ప్రయత్నించాలని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను కలిసి అనుమతి మంజూరు చేయాలని కోరింది.  సెప్టెంబరు 15న గోదావరిలో రాయల్ వశిష్ఠ బోటు మునిగిపోయి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృతి చెందారు.  గల్లంతైన మరికొందరి మృతదేహాలు ఇప్పటికీ లభ్యం కాలేదు.  అయితే బోటును వెలికితీసే బాధ్యతలు అందుకున్న కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం కొన్ని రోజుల క్రితం గోదావరిలో విఫలయత్నాలు చేసింది.  మూడ్రోజులపాటు శ్రమించినా కనీసం బోటు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేకపోయారు.  అదే సమయంలో గోదావరికి మరోసారి వరద ఉద్ధృతి పెరగడంతో వెలికితీత ఆపరేషన్ నిలిపివేశారు.  ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి నెమ్మదించింది....

**బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్**

బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ ముంబై:  భారతసంస్కృతికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా ఉన్న బిగ్‌బాస్ సీజన్ 13 షోపై నిషేధం విధించాలని డిమాండ్లు వస్తోన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు.   కర్ణిసేన కార్యకర్తలు ముంబైలోని సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బెడ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.  సీజన్ 13కు తీసుకుంటోన్న ఇతివృత్తం భారత సంస్కృతిని మంటగలిపేలా ఉందని, కర్ణిసేన వర్గంతోపాటు మరికొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

***హుజూర్‌ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు***

***హుజూర్‌ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు*** *సూర్యాపేట* :  హుజూర్‌ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు  మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104  ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500  సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల  కోడ్ ఉల్లంఘన కేసులు: 10  సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం.  అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు:  టిఆర్ఎస్ -  శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112  కాంగ్రెస్ -  పద్మావతి రెడ్డి - రూ.5,27,621  బీజేపీ -  కోట రామారావు - రూ.4,22,258  స్వతంత్ర అభ్యర్థి -  తీన్మార్ మల్లన్న - రూ.3,73,945.  టిడిపి -  చావా కిరన్మయి - రూ.3,46,968  స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  ఓ పోస్ట్ *తెలంగాణాలో రాష్ట్రపతి పాలన కు రంగం సిద్ధం..?*

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  ఓ పోస్ట్ *తెలంగాణాలో రాష్ట్రపతి పాలన కు రంగం సిద్ధం..?* - *క్షుణ్నంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం*  - *శాంతిభద్రతల సమస్య పేరుతో కేసీఆర్ ను తప్పించేందుకు బిజెపి ప్రయత్నాలు*   తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ పై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కానుండడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు బిజెపి ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాద్లో జరిగిన బీజేపీ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ కంటికి గాయాలు కావడం, అరెస్టులతో పరిస్థితి ఉద్రిక్తం కావడం, ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఒక డ్రైవర్ చావుబతుకుల్లో ఉండడం లాంటి ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రావడంతో రాష్ట్రపతి పాలన విధించేం...

ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ కార్మికుడు

ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ కార్మికుడు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కార్వాన్‌ ప్రాంతంలో నివసించే సురేందర్‌ గౌడ్‌, రాణిగంజ్‌ డిపోలో గత 15 సంవత్సరాలుగా కండక్టరుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో సురేందర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

*ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై విజయశాంతి భావోద్వేగ పోస్ట్*

Image
*ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై విజయశాంతి భావోద్వేగ పోస్ట్* హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి చెప్పారు. ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య కానీ... వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఆమె ఎద్దేవా చేశారు.  ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని విజయశాంతి పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణ త్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు.

*శ్రీనివాసరెడ్డి మృతదేహం ఖమ్మంనికి *

Image
*శ్రీనివాసరెడ్డి మృతదేహం ఖమ్మంనికి ** హైద్రాబాద్‌ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం తరలించారు. నిన్న మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న ఖమ్మంలో చికిత్స అందించినా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైద్రాబాద్ లోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మృతి చెందాడు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పోలీసులు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేయించారు. పోస్టుమార్టం పూర్తి చేసిన వెంటనే మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో ఖమ్మం తరలించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన విషయం వెంటనే ఆర్టీసీ కార్మికులు ఆపోలో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్ ను ఏం చేయాలి?:రేవంత్ రెడ్డి

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్ ను ఏం చేయాలి?:రేవంత్ రెడ్డి ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగిస్తారా? సచివాలయానికి రాని కేసీఆర్ పై పీడీ యాక్ట్ పెట్టాలా? ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగా జరుగుతోంది టీఎస్సార్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు రాలేదని కార్మికులను తొలగిస్తానన్న సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా సచివాలయానికి రావడం లేదుగా, మరి, ఆయన్ని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా? అని సెటైర్లు విసిరారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కేసీఆర్ కు ముఖం చెల్లట్లేదని, అందుకే, పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగా జరుగుతోందని అన్నారు.  ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత హరీశ్ రావు గురించి ఆయన ప్రస్తావించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ ఇంత జరుగుతున్నా నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్క...