డిండి రిజర్వాయర్ లో  14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను  విడుదల చేసిన మంత్రి తలసాని


డిండి రిజర్వాయర్ లో  14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను  విడుదల చేసిన మంత్రి తలసాని


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత  ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతాంగానికి,వివిధ వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం గుండ్ల పల్లి మండల కేంద్రంలో  డిండి రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల 50 వేల ఉచిత చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు.అనంతరం మార్కెట్ యార్డులో పశు ప్రదర్శన,లేగ దూడలు ప్రదర్శన ప్రారంభించి  24 మందికి రెండవ విడత గొర్రెల పంపిణీ,28 మందికి పాడి గేదెలు సబ్సిడీ పై పంపిణీ చేశారు.8 మంది గేదెలు చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కింద మళ్లీ ఉచితంగా గేదెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా స్వరాష్ట్రం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్య మంత్రిగా కె.సి.అర్ ఐదు సంవత్సరాలు గా ఎన్నో కార్య క్రమాలు,24 గంటలు కరెంట్ సరఫరా,రైతు బంధు కింద పెట్టుబడి సాయం కింద రైతులకు రెండు పంటలకు ఈ సంవత్సరం నుండి ఎకరానికి 10,000 రూ.లు ఆర్థిక సాయం అందచేస్తున్న ట్లు తెలిపారు.
రైతు బంధు,రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శం గా వున్నాయని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రం వైపు చూస్తూ అమలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. షాది ముబారక్,కళ్యాణ లక్షి,ఆసరా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.వ్యవస్సాయంతో పాటు పాడి పై ఆధారపడి జీవించే మత్స్య కారులకు,గంగ పుత్రులకు ఉచిత చేపల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం,కుల వృత్తులు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.యాదవులకు 21 గొర్రెలు యూనిట్ గ సబ్సిడీ పై అందచేస్తున్నట్లు తెలిపారు.గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్,75 శాతం సబ్సిడీ పై గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు.మత్స్య శాఖ ద్వారా 1000 కోట్లతో మత్స్య కారుల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.చేపల పెంపకం మత్స్య కారులకు లాభాలు తీసుకువస్తాయనీ అన్నారు.వ్యవసాయం చేసే రైతులు వర్షాలు,నీళ్ళు లేక పంటలు చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితులు గమనించి పాడి రంగాన్ని ప్రోత్సహిస్తునట్లు తెలిపారు. విజయ డైరీ,నల్గొండ డైరీ ద్వారా సేకరించిన పాలకు 4 రూ.లు ప్రోత్సాహకం అంద చేసేలా రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
గుండ్ల పల్లి కి వరాలు:
స్థానిక శాసన సభ్యులు కోరినట్లు పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.డి.డి.లు కట్టిన వారికి గొర్రెల యూనిట్ లు ఈ నెల 30 లోగా అందజేస్తామని అన్నారు. చేపలు అమ్ముకొడానికి కలెక్టర్ స్థలం కేటాయిస్తే చేపల మార్కెట్ సదుపాయం కల్పించనున్నట్లు,గొర్రెల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు,పశు సంవర్తక శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని,పశు సంవర్థక ఆసుపత్రి అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆసుపత్రి లు  బాగు చేస్తామని తెలిపారు. జీవాలకు,గేదెలకు ఇబ్బంది వస్తే 1962 కు పోనే చేస్తే మొబైల్ వాహనం వస్తుందని,డాక్టర్ మందులు అందు బాటు లో వుంటారని అన్నారు.రైతులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని అన్నారు.
శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పట్టణ,ప్రాంతాల తో పాటు,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.
జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ జిల్లా ధాన్యం ఉత్పత్తి, సేకరణ లొ,గొర్రెల పంపిణీ లో జిల్లా ముందంజలో వుందని,ప్రభుత్వ పథకాలు ప్రజా ప్రతినిధులు,ప్రజల భాగస్వామ్యం తో విజయవంతంగా అమలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సమావేశంలో పశు సంవర్తక శాఖ డైరెక్టర్ డా.లక్ష్మా రెడ్డి,పశు సంవర్థక శాఖ ఇంఛార్జి జే.డి. డా.శ్రీనివాస్,మత్స్య శాఖ అధికారిని చరిత,అర్.డి.ఓ.లింగ్యా నాయక్,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్