*వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.*

*వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.*


ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ వాలంటీర్ల
భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజశంకర్‌ తెలిపారు. 9674 గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.


◆ నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 10 వరకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ.


◆ నవంబర్‌ 11 నుంచి 15 వరకు దరఖాస్తుల పరీశీలన


◆ నవంబర్‌ 16 నుంచి 20 వరకు అభ్యర్దులకు
ఇంటర్వ్యూలు


◆ డిసెంబర్‌ 1 నుంచి విధుల్లోకి కొత్తగా ఎంపికైన వాలంటీర్లు


జిల్లాల వారీగా ఖాళీల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముందుగా అన్ని వాలంటీర్ల పోస్టులు భర్తీ చేశారు. కొంత మందికి సచివాలయ ఉద్యోగాలు రావడంతో మరికొంత మంది
వ్యక్తిగత కారణాలతో వాలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో వాలంటీర్‌ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జగన్‌ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలుచేపట్టారు.


*జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.*


★ శ్రీకాకుళం 200
★ విజయనగరం 823
★ విశాఖపట్నం 370
★ పశ్చిమ గోదావరి 590
★ తూర్పుగోదావరి 1861
★ కృష్ణా 453
★ గుంటూరు 919
★ ప్రకాశం 592
★ నెల్లూరు 340
★ చిత్తూరు 678
★ కడప 891
★ అనంతపురం 955
★ కర్నూల్‌ 976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్