సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టి వేసింది. 
సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలను నిరోధించే ఉద్దేశంతో ఈ పిల్‌ను సుప్రీంలో దాఖలు చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. కాగా, అన్ని విషయాలను సుప్రీం వరకు రావాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.  పిల్‌పై వాదనలు విన్ని సుప్రీం కోర్టు.. ''ఈ విషయం గతంలో మద్రాసు హైకోర్టు దృష్టికి వచ్చింది. ప్రతి విషయం సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదు'' అని అభిప్రాయపడింది. 
నకిలీ ఖాతాలు, పెయిడ్ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయని, వాటిని నిరోధించాలంటే ప్రతి ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయాలని లాయర్, బీజేపీ నేత అశ్విణి ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్