రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు
న్యూఢిల్లీ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం గురువారం వెల్లడించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తిరువనంతపురంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వి. నారాయణస్వామి చెప్పారు.
Comments
Post a Comment