*జాతీయ ఐక్యత,సమగ్రతకు అంకితం కావాలి:ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్*
*జాతీయ ఐక్యత,సమగ్రతకు అంకితం కావాలి:ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్*
* జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతిఙ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్
నల్గొండ,అక్టోబర్ 31.జాతీయ సమైక్యత, సమగ్రత,భద్రతను కాపాడేందుకు అంకితం కావాలనీ ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కాద్యాలయం లో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించి జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో ఇంఛార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ మాట్లాడుతూ
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పరంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుపొందారని ఆయన అన్నారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుందని అన్నారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడని, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టినట్లు వివరించారు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడని తెలిపారు.నేడు ప్రతి ఒక్కరూ కుటుంబం లో,కార్యాలయం లో ఆయన చూపిన బాటను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ ఐక్యతకు,సమగ్రతకు,దేశ భద్రతకు అంకితం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్,జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్,పౌర సరఫరాల సంస్థ డి.యం. నాగేశ్వర్ రావు,ప్రత్యేక ఉప కలెక్టర్(భూ సేకరణ),వాసు చంద్ర,కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారి మోతీ లాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment