ఆటో డ్రైవర్ దారుణ హత్య
ఆటో డ్రైవర్ దారుణ హత్య
పంజాగుట్టలోని నాగర్జున హిల్స్ సమీపంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ..పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు..రియసత్ అలీ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రితం ఆటోడ్రైవర్ అన్వర్ తో విభేదాలు ఏర్పడి గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు..గత కొన్ని రోజుల క్రితం అన్వర్ అలీ హత్య చేసి జైలుకు వెళ్ళాడు.. జైలుకు వెళ్ళిన అనంతరం ఐదు రోజుల కింద బెయిల్ పై విడుదలైన ఈ రోజు అతని చంపినట్లు పోలీసులు తెలిపారు ..ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో టీ తాగడం కోసం వస్తున్నా రియా సత్ అలీని పథకం ప్రకారం చుట్టుముట్టే ఐదు మంది చంపినట్లు పోలీసులు తెలిపారు..కత్తులు గోడ్డలను తీసుకువచ్చి అతని వెనుక నుండి పథకం ప్రకారం మట్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు ..తమ స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య గల కారణాలను విచారిస్తున్నారు..ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సెర్చ్ ద్వారా పలు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు..హత్యకు గురైన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు..
Comments
Post a Comment