*బాలిక చివరికోరిక తీర్చిన పోలీసులు*
*బాలిక చివరికోరిక తీర్చిన పోలీసులు*
హైదారబాద్: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక చివరి కోరికను రాచకొండ పోలీస్ కమిషనర్ తీర్చారు. ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన రమ్యా ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. ఆమెకు ఒక రోజైన పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించాలనే కోరిక ఉంది. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ రాచకొండ సిపి మహేష్ భగవత్‌కు తెలపడంతో అంగీకరించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రమ్యా నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కార్యాలయంలో ఒక రోజుల సిపిగా వ్యవహరించారు. ఆమెకు సిపి మిగతా పోలీసులు సాదరంగా ఆహ్వానం పలికారు.నర్సింహ, పద్మల కూతురు రమ్య బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. నిమ్స్‌లో చికిత్స తీసుకుంటోంది. ఈ సందర్భంగా రమ్యా మాట్లాడుతూ ఒక రోజు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని అన్నారు. రాచకొండ శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన సిపి మహేష్ భగవత్, అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరగా కోలుకోవాలని రాచకొండ పోలీసులు కోరారు. రాచకొండలో ఇది రెండవ సంఘటన గతంలో కూడా ఇషాన్ ఒక రోజు పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు.
Comments
Post a Comment