**మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌**

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌


అనంతపురం:  


టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్‌ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. 


అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్‌ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్‌ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్‌, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్