ఎల్‌బీ నగర్ షైన్ ఆసుపత్రిలో ఐసీయులో షాట్ సర్క్యూట్‌తో ఐదు నెలల చిన్నారి మృతి ఆరుగురికి గాయాలు
ఎల్‌బీ నగర్ షైన్ ఆసుపత్రిలో ఐసీయులో షాట్ సర్క్యూట్‌తో ఐదు నెలల చిన్నారి మృతి ఆరుగురికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని ఎల్‌బీ నగర్ షైన్ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయులో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు.
Comments
Post a Comment