సంకల్పం,స్వయం కృషి తో మహర్షి గా ఎదగవచ్చు - వాల్మీకి జయంతి వేడుకలలో ఇంఛార్జి కలెక్టర్
సంకల్పం,స్వయం కృషి తో మహర్షి గా ఎదగవచ్చు
అందుకు వాల్మీకి జీవితమే నిదర్శనం
వాల్మీకి రామాయణ కావ్యం సమాజానికి దిక్సూచి
వాల్మీకీ నేటి యువతకు మార్గదర్శకుడు
వాల్మీకి జయంతి వేడుకలలో ఇంఛార్జి కలెక్టర్
ప్రతి మనిషీ తప్పులు చేయడం సహజమేనని, అయితే వాటిని తెలుసుకొని సరిదిద్దుకుని స్వయం కృషి ,సంకల్పం తో ముందుకు సాగితే మహిర్షి కావచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తీ వాల్మీకి అని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు . వాల్మీకి జీవితం ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు .
ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో ని మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఇంఛార్జి జిల్లా కలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ....
రామాయణాన్ని రచించిన వాల్మీకి ఆ కావ్యం ద్వారా మానవీయ విలువలు, రాజనీతిని మార్గదర్శనం చేశారని అన్నారు. కుటుంబం బంధాలు, విలవలతో కూడిన జీవన విధానాన్ని రామాయణం ద్వారా సమాజానికి చాటారన్నారు. ఇండోనేషియా సహా ప్రపంచ దేశాలు రామాయణం గొప్పతనం , వాల్మీ కి సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయని తెలిపారు . ప్రతి మనిషి తనలో తప్పులను గుర్తించి విలువలతో కూడిన జీవనాన్ని సాగిస్తే మహనీయులుగా ఎదుగుతారన్నది వాల్మీకీ జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నైతిక విలువలతో జీవనయానం సాగించాలని పిలుపు నిచ్చారు. వాల్మీ రామాయణంతో ప్రపంచానికి మానవ బంధాలను చాటారని కొనియాడారు.కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని చాటి చెప్పారని పేర్కొన్నారు .
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్రనాథ్,జిల్లా సహకార అధికారి శ్రీనివాస మూర్తి, అధికారులు , వాల్మీకి కమ్యూనిటి ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.తొలుత వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఇంఛార్జి కలెక్టర్,అధికారులు,తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు
ISSUED BY DPRO Nalgonda
Comments
Post a Comment