కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.., ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం.. 


ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం.. 



ఆర్టీసీ కార్మికులపై అణచివేతతో ఆగిన రథచక్రాలు.. సమ్మె సైరన్ తో స్తంభించిన కార్యకలాపాలు.. నియంత పోకడతో కేసీఆర్ సర్కార్ విచ్చుకత్తి.. ఉద్యమ ద్రోహుల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆగిన కార్మికుల జీవిత చక్రం. కార్మికుల పక్షాన నిలిచిన కమలదళం.. రాక్షసపాలనకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న లక్ష్మణ సైన్యం. కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.. ఆగిన బస్సు చక్రాలతో కారు టైర్ పంక్చర్.. కమలసేన ఎంట్రీతో కేసీఆర్ గుండెల్లో వణుకు.. ఇదీ 'సమ్మె'ట దెబ్బ.


చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆగిన ప్రగతి రథ చక్రాలు.. వారి సమస్యల పరిష్కారం కోసం సైరన్ మోగించిన ఆర్టీసీ కార్మికులు.. సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరితో విసుగుచెందిన కార్మిక సంఘాలు. సాదాసీదాగా ప్రారంభమైన సమ్మెపై నియంత కేసీఆర్ సర్కార్ మొండివైఖరి ప్రదర్శించి ఉక్కుపాదం మోపింది. హక్కుల సాధన కోసం పోరు సాగిస్తున్న వారిపై దమనకాండ సాగించింది. సమ్మెను నీరుగార్చేందకు సర్వశక్తులూ ఒడ్డింది. ఉద్యమానికి దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్టి.. నిరంకుశంగా, రాజ్యాంగ విరుద్ధంగా సెల్ఫ్ డిస్మిస్ అంటూ కొలువుల నుంచి తీసేసింది. ఆఖరుకు ఆర్టీసీ కార్మికులకు వైద్యాన్ని కూడా నిలిపివేయడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. పుండుమీద కారం చల్లినట్లు ఉద్యమంలో లేని మంత్రులు.. ఆర్టీసీ సమ్మెపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆవేదన చెందారు కార్మికులు. దీంతో అగ్నిజ్వాలలను అలుముకుని ఆత్మబలిదానం చేసుకున్నారు.


కేసీఆర్ ప్రభుత్వం దమనకాండతో అప్పుడే అలసిసొలసిన కార్మికుల చక్రాల వేగం పెంచేందుకు కమలనాథులు కదనరంగంలోకి దూకారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ పూర్తి స్థాయిలో పోరాటం ప్రారంభించింది. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ పై పోరు ఉధృతం చేసింది. డ్రైవర్, కండక్టర్ అన్నలకు తెలంగాణ బీజేపీ నేతలు బాసటగా నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిరసనలు, బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికీ పోరు అంటూ లక్ష్మణ్ కన్నెర్రజేశారు. కేసీఆర్ అగ్గితో తలగోక్కొని.. ఒళ్లు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారని చురకలు అంటించారు. టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగు లు అందర్నీ అణచివేసేందుకు జరుపుతున్న రాష్ట్ర సర్కారు కుట్రలను ప్రజలకు వివరించారు. అటు యాబైవేల మంది ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది కమలం పార్టీ.


బస్ భవన్ ముందు ఆందోళన కార్యక్రమంతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ . దీంతో గులాబీ తోటలో కమలం సెగలు రాజుకున్నాయి. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ.. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ.. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా నిలిచింది. సకల జనుల సమ్మె తరహాలో నిరసనలు, ఆందోళనలు చేపట్టి కార్మికుల వాణిని వినిపించేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. 


ఆర్టీసీ భూముల కబ్జాపర్వంను వెలుగులోకి తెచ్చి.. కేసీఆర్ సర్కారుకు గుబులు పుట్టించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. కార్మికుల బలిదానాలకు కారణమైన టీఆర్ఎస్ మంత్రుల వైఖరిని ఎండగట్టారు. తెలంగాణలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు.. ప్రజల పక్షాన నిలిచారు. ఆర్టీసీ సమ్మెపై దురహంకార పోకడ పోతున్న సీఎం కేసీఆర్ ఆగడాలను ప్రశ్నిస్తూ, ఆర్టీసీ భూములను కేసీఆర్.. తనవారికి అప్పనంగా కట్టబెట్టుకున్న తీరుపై  గవర్నర్ తమిళిసైకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందజేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి తమ వాదన వినిపించే అవకాశం కల్పించారు. బిజెపి నేతలు కూడా గవర్నర్ కు ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చారు. 
తెలంగాణలో బీజేపీ సేనాని లక్ష్మణ గర్జనతో కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి.. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అనేలా చేశారు. తెలంగాణలో రక్కసి పాలనను గాడిలో పెట్టడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ సైతం సమాయత్తమైంది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చి అండా నిలిచింది. మొత్తానికి తెలంగాణలో నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ ప్రజాపక్షాన పోరు కొనసాగిస్తోంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్