టిక్ టిక్ టాక్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు


ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు  తీసుకవెళతాం-టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా


టిక్ టాక్ ఇండియా -  తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ, డిజిటల్ మీడియా  ఆధ్వర్యంలో హోటల్ హరిత ప్లాజాలో టిక్ టాక్ మీద తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రజా సంబంధాల అధికారులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా పరిధి రోజురోజుకూ విస్తరిస్తున్న సమయంలో ముఖ్యంగా టిక్ టాక్ యూజర్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. అనతికాలంలోనే  దేశంలో 20 కోట్ల మంది యూజర్లను చేరుకోగలిగింది అంటే టిక్ టాక్ ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు టిక్ టాక్ ఎంతో చేరువయింది. ఈ సందర్భంగా టిక్ టాక్ సమర్థ వినియోగం, పాలసీ విధానాలు, సురక్షా పద్ధతుల మీద టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్ వర్క్ షాప్ లో పాల్గొన్నవారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. గత మూడునెలలుగా టిక్ టాక్ ఇండియా,  కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తోందని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తో పనిచేయడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. సామాజిక భాద్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇండియాలో ముఖ్యంగా గ్రామీణ సమాజంలో టిక్ టాక్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేయడం జరిగింది. టిక్ టాక్ వినియోగదారులకు అందిస్తున్న ప్రత్యేక సేవల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. 
తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  ట్విట్టర్ ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి వేదికలను ఉపయోగించి  ప్రజలను చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టిక్  టాక్ విషయంలో కూడా ప్రభుత్వ సిబ్బందికి అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు టిక్ టాక్ వినియోగం మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం వంటి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని  సూచించారు. 
చివరాగా వర్క్ షాప్ లో పాల్గొన్నవారు టిక్ టాక్ వినియోగం విషయంలో లేవనెత్తిన సందేహాలను టిక్ టాక్ బృందం నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పీఆర్వో రమేష్ హజారి, రాచకొండ కమీషనర్ పీఆర్వో దయాకర్, సైబరాబాద్ కమీషనర్ పీఆర్వో కిరణ్ కుమార్, డిజిపి సీపీఆర్వో హర్ష భార్గవి, టూరిజం, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మొదలైన డిపార్ట్ మెంట్ లకు చెందిన పలువురు ప్రజా సంబంధాల అధికారులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్