విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో లోని అధికారులు సమన్వయంతో నివారణ చర్యలు తీసుకోవాలి


నల్గొండ, ఆక్టోబర్ 30.జిల్లాలో విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు జిల్లా లోని వివిధ శాఖల అధికారులు సమన్వయం,సహకారంతో విపత్తు,ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని విపత్తుల నివారణ నిపుణులు డా.కె.ఆర్.కె శాస్త్రి  అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో విపత్తుల నిర్వహణ పై వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన వివిధ విపత్తులు, ముందు జాగ్రత్త చర్యలు,విపత్తు నివారణ,పునరావాసం,విపత్తు లు తగ్గించేందుకు ,విపత్తు తర్వాత చేపట్ట వలిసిన చర్యలు,జిల్లా విపత్తుల నిర్వహణ ప్రణాళిక పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకషంగా వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ అథారిటీ,జిల్లా విపత్తుల నివారణ ప్రణాళిక రూపకల్పన అంశాలపై వివరించారు. విపత్తులు ,ప్రకృతి వైపరీత్యాలు,వరదలు, తుపాన్ లు సంభవించి నప్పుడు పొంచి ఉన్న ప్రమాదం,ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు, పునరావాస చర్యలు, విపత్తు తర్వాత చేపట్టవలసిన చర్యలు,నష్ట తీవ్రత ఇతర అంశాలు,వివిధ శాఖలు నిర్వహించ వలసిన చేపట్ట వలసిన చర్యలు శిక్షణ నిచ్చారు.జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ కి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా,జిల్లా పరిషత్ సి.ఈ. ఓ.వైస్ చైర్మన్ గా,ఎస్.పి.,జె.సి.,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,ఇతర అధికారులు సభ్యులు గా ఉంటారని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,సాగు నీటి శాఖ, రెవెన్యూశాఖ ముఖ్యమైన పాత్ర పోషించ వలసి ఉంటుందని అన్నారు.ముఖ్యంగా ఇటీవల కేరళలో సంభవించిన వరదల లో సోషల్ మీడియా ను ప్రభావిత ప్రాంతాలు, బాధితులు గురించి తేలుసు కోవడానికి ,సమాచారంపంచుకోవడానికి,సమన్వయం, ఆహార పంపిణీ,ఇతర విషయాలకు ప్లాట్ పామ్ గా ఉపయోగించుకున్నారని తెలిపారు. 
జిల్లా రెవెన్యూ అధికారి  రవీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక వివిధ శాఖల నుండి తగిన సమాచారంతో రూపొందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ,ఆంధ్ర స్టేట్ సోషల్ సర్వీస్ ఫోరమ్ యం. సుధాకర్ డేవిడ్ జిల్లా అగ్నిమాపక ఆధికారి  యజ్ఞ నారాయణ,జిల్లా పౌర సంబంధాల అధికారి పి. శ్రీనివాస్,జిల్లా విద్యా శాఖ ఆధికారి బిక్షపతి, జిల్లా మత్స్య శాఖ అధికారిణి చరిత,జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ ఈ ఈ పాపా రావు ,ఆరోగ్య విస్తరణ అధికారి సయ్యద్ రఫీ అహ్మద్ ,ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుబాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్