ఆర్టీసీ కార్మికులు బందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) మద్దతు
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న బందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) సంపూర్ణ మద్దతు
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న బందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) సంపూర్ణ మద్దతు తెలుపు తున్నదని అధ్యక్షుడు పగడాకుల బాలస్వామి తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాయడం ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వానికి నిదర్శనంగా జాట్ భావిస్తోందని, ఆర్టీసీ కార్మికుల విషయంలో పంతానికి పోయి ప్రజలను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కెసిఆర్ కు తగదని హెచ్చారంచారు. బందులో జాట్ సభ్యులందరo పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు.
Comments
Post a Comment