**ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ మృతి**
ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ మృతి
హైదరాబాద్: ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు.
90 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు.
కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి చికిత్స అందించారు.
అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు.
ఆర్టీసీ డ్రైవర్ మృతి నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment