ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ .


ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ .


భారతదేశం మొత్తం భద్రాద్రి వైపు చూసేలా గా అభివృద్ధి సాధించాలి ప్లాస్టిక్ నిషేధం లో ...జె డి లక్ష్మీనారాయణ ,
ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పథకం అద్భుతం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఐఏఎస్ .


ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం లో భద్రాచలం పట్టణం ముందు వరుసలో ఉండగా దేశం మొత్తం భద్రాద్రి వైపు చూసే లాగా భద్రాద్రిని అభివృద్ధి చేసి చూపించాలని అభిలాషించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ .బుధవారం ఉదయం ఆయన భద్రాచలం పట్టణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ప్లాస్టిక్ నిషేధం పై ప్రగతిని సమీక్ష నిర్వహించిన ఆయన భద్రాచలంలో పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా పలు ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమాలను చేపట్టారు మొదటగా ఉదయపు నడక ప్రారంభించి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి చెత్తను, ప్లాస్టిక్ వ్యర్ధాలను భద్రాచలం పట్టణంలోని వాకర్స్ క్లబ్ లో ఉన్న సభ్యులు మరియు పట్టణ ప్రజలు ప్రముఖుల సహకారం తో తొలగించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ మనమందరం కూడా మన గ్రామాన్ని మన ఇంటిని మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా మనందరం కూడా సుఖసంతోషాలతో జీవించవచ్చ,ని కావున ప్రతి ఒక్కరు తమ జీవితం నుంచి ప్లాస్టిక్ నిషేధించి చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా గ్రామపంచాయతీ వారి  చెత్త కుండీల్లోనే వేయాలని కోరారు. తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం వారి ఆహ్వానం మేరకు భద్రాచలం పట్టణంలోని రెడ్ క్రాస్ బిల్డింగ్ లో ఉన్నటువంటి రక్తనిధి కేంద్రాన్ని సందర్శించి ప్రసంగించారు ఈ సందర్భంగా  శ్రీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన టువంటి భద్రాచలంలో ఇటువంటి రక్త నిధి ప్రజలకు అందుబాటులో ఉంచటం నిజంగా గర్వకారణం అని చెప్పేసి ఇటువంటి సదుపాయాలు కల్పించిన అందరిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధానికి తాము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి  సొసైటీ సభ్యులు డాక్టర్ కాంతారావు జేడీ ఫౌండేషన్ వారికి తెలియజేసి ,భద్రాద్రి భద్రాచలం పై ఇంతటి మక్కువ మమకారము ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న శ్రీ లక్ష్మీనారాయణ గారికి అలాగే భద్రాచలం పట్టణాన్ని ప్లాస్టిక్ నిషేదించి ముందు వరుసలో నిలిచిన భద్రాచలం  భాద్యుడు శ్రీ మురళీమోహన్ కుమార్ కి ఈ సందర్భంగా సత్కరించారు. భద్రాచలం ఫౌండేషన్ బాధ్యులు మురళీ మోహన్ కుమార్ ఇంటిలో అల్పాహారం చేసిన తర్వాత భద్రాచలం పట్టణంలోని అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన పూర్తిస్థాయి ప్లాస్టిక్ రహిత షాప్ ని పంచాయతీ అధికారి శ్రీమతి ఆశాలత ఆశ లత వారితో పాటు కలిసి ప్రారంభించారు, కేవలం ప్రజలకు అందుబాటులో ప్లాస్టిక్ రహిత వస్తువులు ఉండేలా చూడాలని అలాగే ఎటువంటి లాభాపేక్ష లేకుండా హోల్ సేల్ ధరలకే అందుబాటులో ఉంచిన శ్రీ కనక మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ యజమానులను ప్రశంసించారు. షాపు ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భద్రాచలం పట్టణంలోని పలువురు ప్రముఖులు వివిధ స్వచ్ఛంద సంస్థల యజమానులు, పంచాయతీ EO శ్రీనివాసరావు , వ్యాపారస్తులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ భద్రాచలం రాముడు నడయాడిన టువంటి ఈ ప్రాంతంలో  జేడీ పౌండేషన్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం అదృష్టమని దానికి సహకరిస్తున్న ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు ఇంకా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ని వ్యాపారస్తులు పట్టణ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు .మార్పు మన ద్వారానే రావాలని నిరూపించి భద్రాద్రి పట్టణాన్ని తెలుగు రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలిపారని తెలియజేశారు. ఈ సందర్భంగా జెడి ఫౌండేషన్ బాధ్యుడు శ్రీ మురళీ మోహన్ కుమార్ కు పౌండేషన్ తరఫున లక్ష రూపాయల విరాళం అందజేసీ  ప్లాస్టిక్ నిషేధం కోసం మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువై పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ఆశలత మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత భద్రాచలం కి తాను కూడా సంపూర్ణ సంపూర్ణ సహకారం అందిస్తామని, ప్రత్యేక చొరవ చూపించి నిధులు కేటాయించి భద్రాచలం పట్టణంలో  పారిశుధ్యం కి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తానని తెలియపరిచారు .అనంతరం సబ్ కలెక్టర్ గారు శ్రీ భవేశ్ మిశ్రా ఐఎఎస్ గారితో కలిసి చర్ల రోడ్డులో గ్రామ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కొత్త మార్కెట్ నందు జెడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన" ఒక కేజీ ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం "అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్  మాట్లాడుతూ ఈ ఒక కేజీ కి ఒక ప్లాస్టిక్ కి ఒక కేజీ బియ్యం పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో జిల్లా అనిఇంతకుముందు ఇటువంటి కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా మరియు ములుగు జిల్లాలో విజయవంతంగా నడుస్తుందని తెలిపారు. అలాగే భద్రాచలం పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానం  చూరగున్న జేడీ ఫౌండేషన్ను అభినందించారు.  నవంబర్ 13 తర్వాత పూర్తిస్థాయిలో single use ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నామని దీనికి ప్రజలతో పాటు వ్యాపారస్తులు అందరు కూడా పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా,ఆయన తెలుపుతూ ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి పట్టణంలో ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి ప్లాస్టిక్ నిషేధంపై మార్పు చేసినందుకు జెడి ఫౌండేషన్ భద్రాచలం టీమ్ ని అభినందించారు.తదుపరి రైతులకు చేయూత నిచ్చే డ్రోన్ ని సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు అనంతరం డెమో ని తిలకించారు. అనంతరం సబ్ కలెక్టర్  శ్రీ లక్ష్మీ నారాయణ ని తన కారులో వెంటబెట్టుకుని తన కార్యాలయమునకు తీసుకువెళ్లి, రాబోయే రోజుల్లో భద్రాచలంలో ప్లాస్టిక్ నిషేధం పై తీసుకోవలసిన పలు కార్యక్రమాల గురించి శ్రీ లక్ష్మీనారాయణ తో చర్చించారు ,తదుపరి భద్రాచలం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తున్న పలువురు వ్యాపారస్తులను శ్రీ లక్ష్మీనారాయణ  ఛాంబర్ ఆఫ్ కామర్స్  ఆధ్వర్యంలో శ్రీ ఖంభంపాటి సురేష్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమాలలో భద్రాచలం పట్టణంలోని ప్రముఖులు శ్రీ జిఎస్ శంకర్రావు, చారుగుళ్ల శ్రీనివాస్, దేసప్ప, టిఆర్ఎస్ నాయకులు శ్రీ తెల్లం వెంకట్రావు, శ్రీ తిప్పన సిద్ధులు, శ్రీ తల్లపూడిరాము, శ్రీ భీమవరపు వెంకటరెడ్డి, శ్రీ గొల్ల భూపతి రావు, రిటైర్డ్ ITDA అధికారి శ్రీ వీరయ్య, చావా లక్ష్మీనారాయణ,జేడీ పౌండేషన్ సభ్యులు  టి పి రావు, సతీష్, సంపత్ ,బచ్చు సతీష్, మహిళా మండలి సభ్యురాలు శ్రీమతి గంగా భారతి తదితరులు పాల్గొన్నారు .


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్