**నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో ఉంచినా చర్యలు***
అమరావతి
నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు వ్యక్తులు సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలు కల్పించిన ప్రభుత్వం
ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు స్పష్టం చేసిన సమాచార పౌరసంబంధాల శాఖ
సంబంధిత శాఖల కార్యదర్శులు దురుద్దేశపూర్వక, నిరాధారమైన వార్తలకు రిజాయిండర్లను జారీ చేయటంతో పాటు ఫిర్యాదు చేసేందుకూ అధికారాలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
Comments
Post a Comment