*దాన్యం సేకరణ, కొనుగోళ్లపై కాల్ సెంటర్ ప్రారంభించిన ఇంఛార్జి కలెక్టర్*
*దాన్యం సేకరణ, కొనుగోళ్లపై కాల్ సెంటర్ ప్రారంభించిన ఇంఛార్జి కలెక్టర్*
నల్గొండ, అక్టోబర్ 31.ఖరీఫ్ 2019-20 సీజన్ కు సంబందించి ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కాల్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జిల్లా లో ఖరీఫ్ దాన్యం సేకరణకు 100 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, దాన్యం రాకను అనుసరించి ఇప్పటికే జిల్లాలో 33 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండీ వరి ధాన్యం మద్దతు ధర కు కొనుగోళ్లు ప్రారంభమైనట్లు వెల్లడించారు. దాన్యం కొనుగోళ్లు,సేకరణ లొ సమస్యలు,ఎటువంటి ఫిర్యాదులు వున్నా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ 18004251442 టోల్ ప్రీ నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. కాల్ సెంటర్ లో దాన్యం కొనుగోళ్లు లో పాలు పంచుకునే అన్ని శాఖలు వ్యవసాయ శాఖ,మార్కెటింగ్,పౌర సరఫరాల శాఖ,జిల్లా పౌర సరఫరాల సంస్థ,తూనికలు కొలతలు శాఖలు,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,సహకార శాఖ,కార్మిక శాఖ,రైస్ మిల్లర్ అసోసియేషన్ నుండి ప్రతి నిధులు కాల్ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తారని,ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు షిఫ్ట్ పద్ధతి లో విధులు నిర్వర్తిస్తారని అన్నారు.వ్యవసాయ శాఖ అధికారి తేమ,నాణ్యత శాతం, టార్పాలిన్లు,రవాణా,కేంద్రాల్లో సమస్యలు, హమాలీల కూలి సమస్యలు,రైస్ మిల్లర్ ల కు సంబంధించి,దాన్యం సేకరణ నపై ఎటువంటి సమస్య ఉన్నా కాల్ సెంటర్ నంబర్ కు ఫోన్ చేయాలని,సంబంధిత శాఖల సిబ్బంది ఫోన్ నంబర్ కు చేసినా సమస్య ను రిజిస్టర్ లో నమోదు చేసి వారి శాఖల ఉన్నతాధికారులకు తెలిపి సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు.వరి దాన్యం కొనుగోలు,సేకరణ పై కాల్ సెంటర్ లో విధులు నిర్వర్తించే సిబ్బంది,ఇంచార్జి అధికారి ప్రతి రోజు వచ్చే పిర్యాదు లు,సమస్యలు రిజిస్టర్ లలో నమోదు చేసి పరిష్కారం కు ఆయా శాఖల జిల్లా అధికారులకు తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ.రవీంద్రనాథ్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment