శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి. కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ...
శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి.
కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ...
బిజెపి మీడియా స్టేట్మెంట్ ... పాయింట్స్
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మరణించడం పట్ల బీజేపీ సంతాపం తెలియజేస్తుంది.
ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడడం భాదకలిగిస్తుంది.
శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది.
శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి.
48000 మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలని కెసిఆర్ నిర్ణయం ప్రకటించి... తరువాత శ్రీనివాస్ రెడ్డి ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశారు.
శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు సిఎం కెసిఆర్ ప్రేరేపిత కారణమని బీజేపీ భావిస్తుంది.
ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెంది ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ విజ్ఞప్తి చేస్తుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా ఐక్యతతో పోరాడటం చేయాల్సిన అవసరం ఉంది.
భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు కోపాన్ని చవిచూడక తప్పదు.
సిఎం కెసిఆర్ తన ఆలోచనలేని నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పేల్చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర పాఠశాలలు పనిచేయడం లేదు, రవాణా వ్యవస్థ కుప్పకూలింది, వాణిజ్యం , స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో
కూరగాయలు , పాలు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్రంలో అందరి జీవితలపై ప్రభాభం చూపుతుంది.
ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను కాపాడటానికి బిజెపి వారి వెనుక నిలబడుతుంది .
సిఎం కెసిఆర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యకు పరిష్కారం కనుగొనలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
Comments
Post a Comment