**కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా**

కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా


హైదరాబాదు:


కోతి పిల్లను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్న కుటుంబానికి భారీగా జరిమానా పడింది. కోతిపిల్లకు విముక్తి లభించింది. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా, పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు కుమారుడు (12)తో కలిసి మల్లాపూర్‌లో ఉంటున్నారు. నగరంలో గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ల కుమారుడు మంగళవారం కోతి పిల్లను గొలుసుతో కట్టి ఆడిస్తూ భిక్షాటన చేస్తూ జంతువుల పట్ల దయగల సమాజం (కంపాశనేట్‌ సొసైటీ ఫర్‌ అనిమల్స్‌) ఫౌండర్‌, ఛైర్‌పర్సన్‌ నాగారం ప్రవళ్లిక కంటపడ్డాడు. కోతిపిల్లను గోలుసులతో బంధించడమే కాకుండా బాలుడు భిక్షాటన చేయడంపై ఆమె స్పందించారు. ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకొని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు బాలుడి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు రప్పించి వారందరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కోతిపిల్లతోపాటు బాలుడు, అతడి తల్లిదండ్రులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. విచారణ జరిపిన అధికారులు బాలుడి కుటుంబానికి రూ.10వేల జరిమానా విధించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్