ఉల్లి కిలో 100
పాట్నా :
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. కిలో ఉల్లిపాయలను రూ. 100కు అమ్ముతున్నారు.
కొన్ని రాష్ర్టాల్లో అయితే ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు.
బీహార్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉల్లిపాయ కౌంటర్లను తెరిచారు.
ఈ కౌంటర్ల వద్ద గృహిణులు బారులు తీరారు. కిలో ఉల్లిపాయలను రూ. 35కు అమ్ముతున్నారు.
అయితే కొందరు దుండగులు ఉల్లిపాయలను విక్రయించే వారిపై రాళ్లు విసిరి దాడులు చేస్తున్నారు.
వారి నుంచి రక్షణ పొందేందుకు తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయలను విక్రయిస్తున్నామని అధికారులు తెలిపారు.
తమకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదు.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Post a Comment