**మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా**


*మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా*


నల్గొండ : మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడంతో పాటు మోతాదుకు మించి సేవించిన వారిని కోర్టులో హాజరుపరిచాడు. సోమవారం ట్రాఫిక్ సి.ఐ. సురేష్ బాబు, ఎస్.ఐ. కొండల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో బ్రీత్ ఎనలైజర్లతో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి పరీక్షలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన నల్గొండ పట్టణానికి చెందిన సైదులు, కట్టంగూరు మండలం బొల్లేపల్లికి చెందిన జి..కృష్ణయ్య లకు రెండు రోజుల జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా, నల్గొండ పట్టణం బొట్టుగూడకు చెందిన ఎం.డి.లతీఫ్ కు ఒక రోజు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ సురేష్ తెలిపారు. అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మరో ఎనిమిది వ్యక్తులకు 10,500 రూపాయల జరిమానా విధించారని మొత్తం 16,500 జరిమానా విధించునట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 కేసులకు గాను 11 మందికి జరిమానాలు విధించగా, ముగ్గురికి జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్షలు తప్పవని ట్రాఫిక్ సిఐ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు, వాహనదారులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ప్రజలంతా పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్